Jump to content

పుట:PadabhamdhaParijathamu.djvu/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప_____అప 69 అప_____అప

అపపాడి

  • అన్యాయము.
  • "అవనిపతులు పలువు రపపాడి నొక్కనిం, దన్ను బొదివికొనిన దరల కెదిరి." మార్కం. 8. 113.

అపప్రథ

  • ప్రవాదము. నిజము కాదన్న సూచన ఇందులో ఉన్నది.
  • "వాడు చాలా గర్విష్ఠి అని ఒక అప ప్రథ యేర్పడింది. వాడితో నాలుగు మాటలు మాట్లాడితే అది వట్టిఅపప్రథ అని యిట్టే తెలిసి పోతుంది." వా.

అప భ్రంశపు మనిషి

  • వక్రపు మనిషి.
  • "వాడు వట్టి అపభ్రంశపు మనిషి." వా.
  • చూ. అపసవ్యపు మనిషి.

అపరం

  • ఉత్తరక్రియలను చేయించే కల్పం.
  • "వాడు అపరం చెప్పుకొన్నాడు ఆయన దగ్గఱ." వా.
  • "నేను అపరం చేయించను. పై ఊరి నుంచీ మీ రెవరి నైనా పిలుచోకో వలసిందే."
  • చూ. అపరక్రియలు.

అపర క్రియలు

  • ఉత్తరక్రియలు.
  • "మా నాన్న అపరిక్రియలకు మా మేన మామే రాలేదు. ఇంక తక్కిన వారి మాట ఎందుకు?" వా.
  • చూ. అపరం.

అపరబృహస్పతి

  • చాలా తెలివితేటలు గలవాడు.
  • ఇది వ్యంగ్యంలో ఎక్కువగా వినబడుతుంది.
  • "వాడు అపరబృహస్పతి కదా! వాణ్ణి వెళ్లి అడగండి. న న్నడిగి ఏం ప్రయోజనం?" వా.
  • చూ. అపరవాచస్పతి.

అపరవాచస్పతి

  • చూ. అపరబృహస్పతి.

అపరాతిరి

  • అర్ధ రాత్రి.
  • "వాడు అపరాతిరివేళ వచ్చి నన్ను నిద్ర లేపాడు. ఇంతకూ సంగ తేమయ్యా అంటే వడ్లగింజలో బియ్యపుగింజ.: వా.

అపరాధము చెల్లించు

  • జరిమానా కట్టు.
  • "అపరాధం చెల్లించితే కానీ వాడు విడుదల అయ్యే సావకాశం కనపడదు." వా.

అపరాధము వేయు

  • జరిమానా వేయు.
  • దక్షిణాంధ్రంలో నేటికీ వాడుకలో ఉంది.
  • "వాడికి యాభైరూపాయలు అపరాథం వేశారు." వా.

అపవర్గము

  • మోక్షము.

అపవాదం (దు)

  • చెడ్డ పేరు.
  • "ఏమీ చేయక పోయినా ఉత్తపుణ్యానికే నామీద అపవాదు వచ్చి పడింది." వా.

అపశకునపు పక్షి

  • ఎప్పుడూ అశుభం పల్కేవాడు.