పుట:PadabhamdhaParijathamu.djvu/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప____అప 70 అప____అపో

  • "శుభమా అని వెడుతుంటే ఈ అపశకునపు పక్షి ఎదురయ్యాడే! ఏ వెధవ మాట అంటాడో." వా.

అపశబ్దపుకూతలు

  • అశుభసూచక మైన మాటలు.
  • "వాడు నో రెత్తితే అపశబ్దపుకూతలే. శుభం పలకరా పెండ్లికొడకా అంటే పందిటి నిండా ముండమోపులే అంటాడు." వా.
  • చూ. అపసవ్యపు కూతలు.

అపశబ్దభయం నాస్తి అప్పళాచార్యసన్నిధౌ

  • వాడి వన్నీ అపశబ్దాలే అనే అర్థంలో వ్యంగ్యంగా ఉపయోగించే పలుకుబడి.
  • తాతాచారుల కథపై వచ్చిన దని ప్రతీతి.
  • "అపశబ్ద భయంనాస్తి అప్పళాచార్య సన్నిధౌ, అనాచార భయం నాస్తి తిష్ఠన్మూత్రస్య సన్నిధౌ." చా.

అపసవ్యపు కూతలు

  • "వాడి వన్నీ అపసవ్యపు కూతలే." వా.
  • చూ. అపశబ్దపుకూతలు.

అపసవ్యపు మనిషి

  • స రైనమనిషి కా దనుట.
  • "వాడు వట్టి అపసవ్యపు మనిషి. అన్నీ లోకవిరుద్ధంగానే చేస్తాడు." వా.

అపస్వరం

  • "వేదోచ్చారణలో ఉదాత్తాను దాత్త స్వరిత స్వరాలను తప్పుగా నుచ్చరించుట.
  • "వాడు పంచదశకర్మలూ చేయిస్తాడు. కానీ, అడుగడుగునా అపస్వరాలే." వా.

అపస్మార మెత్తు

  • పిచ్చి యెత్తు.
  • కాశీ. 2. 138.

అపాత్రదానం

  • అనర్హుడికి దాన మిచ్చుట.
  • "అపాత్రదానం పుణ్య హేతువు కాజాలదు." వా.

అపార్థం చేసుకొను

  • అపోహ పడు అనేఅర్థంలో నేటి వ్యవహారం.
  • "వాడు నన్ను అపార్థం చేసుకొన్నాడు. నే నేపాపం యెఱగను." వా.
  • నాపై అపోహ పడె ననుట.

అపురూపము

  • అమూల్యము, అరుదు.
  • "ఈ కావ్యం చాలా అపురూపంగా ఉంది."
  • "ఆ అమ్మాయిది చాలా అపురూపమైనపుట్టుబడి."
  • "ఆ అమ్మాయిని వాళ్లు చాలా అపు రూపంగా చూచుకుంటారు."
  • "ఈమధ్య మంచినెయ్యే యీ వూళ్లో అపురూప మయిపోయింది." వా.

అపేక్ష చేయు

  • కోరు.
  • "రాగంబు నొడిచి ముక్తి, శ్రీ గౌరవముల కపేక్ష చేయు మునులకున్." విప్ర. 2. 80.

అపోహము పుచ్చు

  • పాడు చేయు.

"లోలదృగ్రుచు లపోహము పుచ్చియు
భోగవృద్ధి నిష్ఫలముగ జేసియున్."
                        కుమా. సం. 7. 41.