ఈ పుట ఆమోదించబడ్డది
అన్యా____అప 68 అప_____అప
వ్యవహారంలో పలుకుబడి అయి పోయినది.
- పండితా. ప్రథ. దీక్షా. పుట 102.
అన్యాయ మింత గలదె
- ఇంత అన్యాయం ఎక్క డైనా ఉందా? ఏ దైనా అత్యా హితం జరిగినప్పుడు అనుమాట.
- "నీ వింత లన్యాయ మింత గలదె." కకా. 5. 18.
అవ ఉపస్పృశ్య
- చేతులు కడుగుకొని అనే అర్థంలో నేటికీ ఉపయోగిస్తారు.
- వైదిక పరిభాష.
- "ఆ వ్యవహారం ఇంక లాభం లే దని అపౌపస్పృశ్య అనుకొని వచ్చేశాను." వా.
అపదూఱు
- అపవాదు.
అపథ్యం చేయు
- రోగి తినగూడని వస్తువులు తిను.
- "వాడు అపథ్యం చేశాడు. రోగం మరీ తిరగ బెట్టింది." వా.
అపనమ్మకపు మనిషి
- నమ్మరానివా డనుట.
- "వాడు చాలా అపనమ్మకపు మనిషి. చేస్తా నని ఒకవేళ వాడు మాట చెప్పినా మనం నమ్ముకొని కూర్చోవడానికి వీలు లేదు." వా.
అపనమ్మిక
- అనుమానము, నమ్మకము లేమి.
- "సొ మ్మొకచో నుండగ నపనమ్మిక యొకచోట నుండు." హరిశ్చ. 5. 316.
అపనయించు
- ఆపు, తొలగించు, చాలించు.
- "అతనితో సల్లాపంబుల నపనయించి." భీమ. 4. 39.
అపనింద
- అపవాదు.
- "వాడు అన్యాయంగా నా మీద అపనింద వేసి పోయాడు." వా.
- చూ. అపవాదు.
అపనింద పాలుసేయు
- అపవాదు వేయు.
- "వాడికి ఏ పాపం తెలీదు. అన్యాయంగా వాణ్ణి అపనిందపాలు చేశారు." వా.
అపనింద మోపు
- చూ. అపనింద వేయు.
అపనింద వేయు
- అపవాదు మోపు.
- "ఏ పాపమూ యెఱగని ఆ అమ్మాయి మీద అపనింద వేసి ఏమి బావుకుంటావు రా?" వా.
- చూ. అపనింద మోపు.
అపనెపము
- అపనింద.
- "అట బోయినంతలో నపనెపమాను." ద్వి. సారంగ. 1 భా. 387.
- "వాడు నామీద ఉట్టినే అపనెపం వేశాడు." వా.