పుట:PadabhamdhaParijathamu.djvu/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అన్ని____అన్ను 67 అన్ను____అన్య

పైన ఇలా క్రమానుసారం పేరుస్తారు.

 • "పరము తపం బడంచి మఱి పార్వతి యం దనురక్తు జేయ మా, యిరువురకుం గుమారు డుదయించిన మాపగ దీరు నంచు నచ్చెరువుగ నన్ని దొంతులును జెప్పగ నేటికి." కుమా. 4. 50.

అన్నినయట్ల

 • నోటికి వచ్చినట్లు - అందిన అట్లెల్లా....

"అన్నినయట్ల యమ్ముని సురాధిపులం
జెడనాడుచున్న నీయున్న తికంటె." కుమా. 2. 28.

అన్ని యున్న విస్తరి

 • నిండుకుండ లాంటి పలుకుబడి. అన్నీ వడ్డించిన విస్తరి యెగిరి పడదు. అందుపై వచ్చిన పదబంధం.
 • "ఆయన అన్నీ ఉన్న విస్తరి. ఏమాత్రం తొణకకుండా తూచి మాట్లాడతాడు." వా.

అన్నీ అతుకులే

 • ఒకటీ పూర్తిగా, చాలి నంతగా లే దనుట.
 • "పొద్దున్నుంచీ లేనివి వెతుక్కోవ డానికే సరిపోతుంది. అన్నీ అతుకులే నాయె." వా.

అన్ను కొను

 • మద మెత్తు.
 • కాశీ. 2. 138.

అన్ను కొలుపు

 • ప్రోత్సహించు.
 • "... ఒక కొందఱు దాల్తు రప్పటి కలుషపథ ప్రవర్తనమె కర్మ పువాసన లన్ను గొల్పగన్." కళా. 2. 108.

అన్ను పట్టు

 • గర్వించు.
 • "అదన నన్నపు నామేన నన్ను పట్టెన్." తాళ్ళ. సం. 10. 258.

అన్నెకాడు

 • అన్యాయస్థుడు.
 • "అన్నె కాడై చాడు నావల పెల్ల నారు దూఱు చేసెనే." క్షేత్రయ్య.

అన్నెము పున్నెము తెలియని

 • అమాయక మయిన; పుణ్యం పాపం తెలియని అనుట.
 • "అన్నెమూ పున్నెమూ మనకు తెలీదు. ఆ భగవంతుడి కెరుక." వా.
 • "ఆ పిల్లకు అన్నెం పున్నెం తెలియదు. దాన్ని యేడిపిస్తా వెందుకు రా." వా.

అన్యథా భావించు

 • అపోహపడు./
 • "నే నేదో అనా నని అన్యథా భావించకండి." వా.

అన్యథా శరణం నాస్తి

 • ఇక గత్యంతరం లేదు అనుట. అన్యధా శరణం నాస్తి త్వ మేవ శరణం మమ - అను శ్లోకంలోని భాగం.

అన్యథా శరణం బొండు లేదు

 • వేఱే దిక్కు లేదు.
 • సంస్కృతవాక్యం - అన్యథా శరణం నాస్తి - కూడా శిష్ట