ఈ పుట ఆమోదించబడ్డది
అన్న____అన్న 66 అన్న____అన్ని
రము. పంచదశ కర్మలలో ఒకటి.
- "ఈ నెలలో చిన్న వాడికి అన్నప్రాశం చేయాలి." వా.
అన్నము నీళ్లు చెల్లు
- ఋణము తీరిపోవు. చనిపోవు.
- "అన్నము నీళ్లు చెల్లిపోయాయి. వాడు పోయాడు. ఎవరిని అని ఏమి ప్రయోజనం?" వా.
అన్నము పువ్వులవలె నున్నది
- ముద్ద కాకుండా విడివిడిగా కనుల పండవుగా ఉన్న దనుట.
"నివ్వరి బియ్యంబున బువ్వులవలె నుండ
వండి వార్చిన యుపహార భాండంబులు." కా. మా. 3. 36.
అన్నమూ లేదు - సున్నమూ లేదు
- ఏమీ లే దనుట. జం.
- నిరసనగా అనుమాట.
- "ఈ వేళప్పుడు ఏం అన్న నయ్యా? అనమూ లేదు సున్నమూ లేదు. పో." వా.
అన్న మో రామచంద్రా యను
- ఆకలితో అల్లాడు.
- "దారిద్ర్యంబు తట్టుముట్టాడ, అన్నమో రామచంద్రా యనుచు...."
- ధర్మరా. 6 పు. 2 పం.
అన్న శాంతి
- ఏ దైనా దోషం ఉంటే తచ్ఛాంతికై అన్న దానం చేయుట.
- "అన్నశాంతి చేస్తే ఈ దోషం పరిహార మవుతుంది." వా.
అన్న సంస్కారము
- వంట.
- "యామార్ధమునకె కావింతు నన్న సంస్కారంబు." పాండు. 4. 153.
అన్న సూక్తం
- అన్నం పరబ్రహ్మస్వరూపం అంటూ అన్నాన్ని స్తుతించే వైదికసూక్తం.
అన్న సూక్తం పఠించు
- ఆకలి గొను.
- "వాడు అన్నసూక్తం పఠిస్తూ కూర్చున్నాడు." వా.
అన్నానా ఆడానా?
- ఏమీ తిట్ట కేద నుట. జం.
- "నే నేమి అన్నానా? ఆడానా? మూతి ముడుచుకొని మూల కూర్చోవలసినంత పనేముందే నా తల్లీ!" వా.
అన్నానికి లేదు
- దరిద్రుడు.
- "వాడికి తినబోతే అన్నానికి లేదు. అయినా జంభం చూస్తే యింత పొడుగు వుంది." వా.
అన్ని దొంతులును చెప్పగ నేటికి
- అన్నీ వరుసగా చెప్పుటెందుకు? దొంతులు పేర్చినట్టు వరుసగా అన్నిటినీ వరుసబెట్టి ఎందుకు చెప్పవలెను అని భావార్థం. దొంతులు క్రమంగా పెద్దది క్రింద, దానికంటె చిన్నది