పుట:PadabhamdhaParijathamu.djvu/853

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జన్ని - జన్నె 827 జన్మ - జప్తీ

జన్నియ విడుచు

 • మీదుకట్టు, దైవప్రీతిగా వదలు. కవిక. 1 ఆ.

జన్నె చేయు

 • మీదుకట్టు, దైవప్రీతిగా ఆంబోతునో దేనినో వదలివేయు.
 • "గోగణంబులలోన గోవు నొక్కటి నేర్చి, జన్నె చేసిన ధర్మశాలి యొకఁడు." రుక్మాం. 2. 105.
 • చూ. జన్నె విడుచు.

జన్నె విడుచు

 • మీదుకట్టు.
 • దైవప్రీతిగా ఏ ఆబోతునో, దున్నపోతునో వదలి వేయుట అలవాటు. దీనిని జన్నె విడుచుట అంటారు. ఇలాంటివే మీదుకట్టు, జన్నె కట్టు, జన్నియ వట్టు, ముడుపు గట్టు అన్నవి. ఇప్పటికీ పాలూ, పెరుగూ మొదలయినవానిని దేవునికి మీదుకట్టిన వని అంటారు. అంటే ఆ మొక్కుబడి తీరేవరకూ దానిని ఇతరు లెవరూ అనుభవింప నీయరు. ఈ ఆచారం మీద వచ్చిన పలుకుబడి. ఈ అర్థాన్ని సూచించే ప్రయోగాలు -
 • "మున్నె కొలు వున్నవానికి, జన్నె విడిచి యన్నెలంత చక్కని వరునే..." శుక. 2. 206.
 • "విషమశరుపేర జన్నియ విడిచి రనఁగఁ, గ్రొవ్వి చరియించు నవ్వీటఁ గోడెగాడ్పు." కవికర్ణ. 1. 15.
 • చూ. జన్నియ విడుచు.

జన్మ కొక శివరాత్రి

 • అరుదుగా వచ్చిన దనుట.
 • "వాడు రాయక రాయక ఏదో పుస్తకం రాశాడు. చేయక చేయక వీ డో సన్మానం చేశాడు. జన్మ కొక శివరాత్రి అన్నట్లు వాడి కది ఒక గొప్పగా కనిపించదా మఱి?" వా.

జన్మవాసన

 • పూర్వజన్మవాసన. వాసనాత్రయములో ఒకటి. మన స్నేహ శత్రుత్వాలకు పూర్వజన్మవాసనలు కారణమని మన పెద్దల నమ్మకం.
 • "మెలఁతకుఁ బతికిన్, వలపు సమం బగుట జన్మవాసన చెలియా!" మను. 6. 66.

జప్పడించుట

 • చప్పరించుట.
 • ప్చ్ - అంటూ తిరస్కార భావంతో కొట్టివేయుట.
 • "మాటల మిమ్ము జప్పడించుటలు సొప్పగునే." పండితా. ప్రథ. దీక్షా. పు. 152.
 • "వా డేం చెప్పినా చప్పరించి వేస్తాడు." వా.

జప్తీ చేయు

 • సొత్తును, సొమ్ములను, ఆస్తిని