పుట:PadabhamdhaParijathamu.djvu/852

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జత - జత 826 జత - జన్ని

జత గట్టు

  • 1. పక్షులు మొదలైనవి జతగూడు.
  • 2. గుంపు గూడు.

జత గావించు

  • సరి చేయు.
  • "యథార్హతన్ మెలపు నయ్యల్ సుమ్ము లోకస్థితుల్, జతగావించు మహామహుల్." మల్లభూ. నీతి. 18.

జత గూడు

  • కలియు.
  • "కూయిడి జతగూడి కెడసి కునుకు పరువులన్." హంస. 4. 222.

జతనపడు

  • ప్రయత్నించు.

జతను పడు

  • పదిలముగా ఉండు.

జతను పఱుచు

  • పదిలపఱుచు

జత పట్టు

  • సావాసము చేయు.
  • "వాడు వట్టి పోకిరిపిల్లవాడులా ఉన్నాడు. వాని జత పట్టవద్దు." వా.

జతపడు

  • జత గలియు, సరిపడు, దొరకు.

జత పఱుచు

  • జత పడునట్లు చేయు.

జత యగు

  • సరిపడు, సమకూరు. భాస్కర. 105.

జత వచ్చు

  • సరి వచ్చు; సమాన మగు.
  • "జత వచ్చు ననవచ్చు జంభారి కాంతకు." జాహ్నవీ. 1. 72.

జత్తాయితం బగు

  • సిద్ధ మగు.
  • "కాకోదర లోకాధిపతిని నత్తరి త్రాడుగా హవణించి జత్తాయితం బై శూరు లగుదేవదానవీరులు పొంకంబుగా..." హేమా. పు. 18.

జద్దువడు

  • మైమఱచి యుండు - సంతోషంతో. శివరా. 1. 64.

జన్నిగట్టు

  • బ్రాహ్మడు - యజ్ఞోపవీతధారి.

జన్నిగొను

  • సన్నిపాతం వచ్చు - అలా ప్రవర్తించు.
  • "చంక లడఁచికొంచు శంకరుఁ బొగడు,చును నుర్కుచును గెర్లి చూచుచు జన్ని,గొనుచు గంతులు వేయుచును." పండితా. పర్వ. 371. పు.

జన్నియ వట్టు

  • మీదుకట్టు.
  • "కన్నియఁ గాని వే ఱొకతె గాను మనోహరరూప! నీకు నే, జన్నియ వట్టియుంటి నెలజవ్వన మంతయు నేఁటిదాఁక." విజ. 1. 97.
  • చూ. జన్నె విడుచు.