పుట:PadabhamdhaParijathamu.djvu/848

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగ - జగ 822 జగ - జగే

జగడగొండి

  • కలహశీలి.

జగడ మాడు

  • కొట్లాడు, దెబ్బలాడు.

జగడాల చీలి

  • జగడగొండి. కుక్కు. 40.

జగడాలమారి

  • కలహశీలి.

జగడించు

  • జగడ మాడు.
  • "....వృధా జగడింపకుఁడు." జైమి. 8. 209.

జగదొంగ

  • గొప్ప దొంగ.

జగనీలి పిసాళిజంత

  • గయ్యాళి, ధూర్తురాలు. జగనగా జగత్ప్రఖ్యాతురా లయిన, నీలి = కృత్రిమపు మాయలు నటించు, పిసాళిజంత - గొప్ప గయ్యాళి.
  • "జగనీలి పిసాళిజంత య,మ్ముద్దియ." పాండు. 3. 71.
  • నీలి అనుటకు -
  • "ఎన్ని నేరిచితివే మటుమాయల నీలి కాన." సారంగ. 3. 53.
  • చూ. నీలివార్తలు, నీలియేడుపులు.

జగనొబ్బ గండడు

  • జగదేకవీరుడు.
  • (గండ=మగడు, ఒబ్బ=ఒక. కన్నడం.) ఇదొక బిరుదు.

జగబంటు

  • గొప్పభటుడు.

జగబిరుదు, ముండమొఱ్ఱ

  • వీరాధివీర బిరుద ముండినా అనాథవలె ఆశ్రోశించును అనుటపై వచ్చిన పలుకుబడి. పేరు గొప్ప ఊరు దిబ్బ వంటిది.
  • "జగబిరుదు ముండమొఱ్ఱయుఁ, దగవే నీ వెఱుఁగవే సుధాకిరణధరా!" నిరం. 3. 16.

జగమగడు

  • గొప్పశూరుడు. అచ్చ. యు. 68.

జగ మెఱిగిన బ్రాహ్మణుడు

  • ప్రసిద్ధుడు.
  • "జగ మెఱిగిన బ్రాహ్మణునికి జందెం బేలా?" చా.

జగాజెట్టి

  • జగజెట్టి.
  • "చెరువు గట్టినజగాజెట్టి వీవ." శ్రీని. 4. 86.
  • చూ. జగజెట్టి.

జిగిలెకాడు

  • తోడల్లుడు.

జగే యను

  • అపహాస్య సూచక మైన ధ్వన్యనుకరణము.
  • "అద్దిర మత్పతి వచ్చు వేళ నీ, కినుకలు సాగ నిచ్చట జగే యన నాతఁడు భీతచిత్తుఁ డై." శుక. 3. 196.