పుట:PadabhamdhaParijathamu.djvu/849

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జజ్జ - జట్టి 823 జట్టి - జడ

జజ్జరకత్తె

  • మోసగత్తె. శ. ర.

జజ్జరకాడు

  • మోసకాడు.

జజ్జుకొను

  • బలహీన పడు.

జట్టికత్తె

  • మారుబేరకత్తె.

జట్టికాడు

  • కొనువాడు; వర్తకుడు; ఓడ నడుపువాడు; జూద మాడించువాడు.

జట్టికొను

  • కొను, స్వాధీన పరుచుకొను.

జట్టి గొను

  • 1. పోటీ పడు.
  • "విలా, సములచేతఁ దార జట్టి గొనుచు." కవిక. 1. 21.
  • 2. విలుచుకొను.
  • "తన నిండుజవ్వనము విలు విచ్చి జట్టిగొన్నది." తాళ్ల. సం. 12. 87.

జట్టి దక్కు

  • అమ్ముడు పోవు, బేరమునకు కట్టుబడి యుండు.
  • "దాసుఁడ నై జట్టి దక్కు చున్నాఁడ." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1530.

జట్టి యాడు

  • బేర మాడు. హర. 1. 20.

జట్టి యిచ్చు

  • సరికి సరి విక్రయించు, ఇచ్చు.
  • "నా, భామల జట్టి యిచ్చి తన పట్టిన యట్టి కడింది నేమముం,దా మఱి కొన్ని నా ళ్లవిహతంబుగ నిల్పుకొన న్మనంబులోన్." కళా. 6. 97.
  • రూ. జట్టి యిడు.

జట్టీ పెట్టుకొను

  • తగాదా వేసుకొను.
  • "వాడు ఏ చిన్నసందు దొరికినా జట్టీ పెట్టుకుంటాడు." వా.

జట్టు కట్టు

  • సావాసము చేయు.
  • "మా సందులో పిల్ల లంతా జట్టు కట్టాము." వా.

జడకుచ్చులు

  • జడలో కొనన పెట్టుకునే ఆభరణము.

జడకొఱ్ఱ

  • కొఱ్ఱలలో ఒక విశేషం.

జడ గట్టు

  • వెండ్రుకలు ఉండలు కట్టు.
  • "నెరుల్ జడగట్టఁగా." విప్ర. 2. 79.
  • రూ. జడ కట్టు.

జడ గొను

  • జడగట్టు.
  • "ఏఁచ మాటలు జడగొన్న పీఁచుఁ గురులు, గలుగు నెఱుకులు దగఁ బొడ గనఁగ వచ్చి." యయా. 1. 102.