పుట:PadabhamdhaParijathamu.djvu/847

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జక్కి - జక్కు 821 జక్కొ - జగ

జక్కిణి గొను

 • నాట్య మాడు.
 • చూ. జక్కిణీ....

జక్కు గావించు

 • చెక్కి వేయు.
 • "మే,దినికిం దెచ్చితి కార్తవీర్యభుజ పంక్తిం జక్కు గావించితి." పారి. 3. 34.

జక్కు జక్కను

 • ధ్వన్యనుకరణము.
 • కుమా. 11. 155.

జక్కుల బోనము లగు

 • భోజనశూన్య మగు, భోజనం వట్టి దగు.
 • కొన్ని వర్గాల పెండ్లిండ్లలో అరివేణి కుండల నెత్తుకొని బోనాలు బోనాలు అనడం అలవాటు. ఆ కుండలలో బోనం మాత్రం ఉండదు. అందుపై వచ్చిన దని ఆముక్తమాల్యద టీక.
 • జక్కు లనగా యక్షులు. యక్షిణీవిద్య గారడీవిద్య. కాబట్టి ఊరకే నామకార్థంగా ఉన్నట్టు కనిపించుటే కానీ అస లుండని మాయా భోజనమే అనుట కూడా కావచ్చును.
 • "బోనంబు ప్రజకు జక్కుల, బోనంబులె యయ్యెఁ బ్రొయ్యి పొగయమి వృష్టిన్." ఆము. 4. 126.

జక్కొను

 • దొరకు.
 • "పలిమెడు మహిసాక్షి ప్రతిదివసంబు, మలహరునకుఁ ద్రిసంధ్యల సమర్పింప, నొక్క నాఁ డెట్టును జక్కొనకున్న, గ్రక్కున మేని కండలు కోసి." పండితా. పురా. 135. పు.

జక్కొలుపు

 • వినియోగించు, సవరించు.
 • చూ. జక్కొల్పు.

జగజంత

 • గయ్యాళి, మాయలాడి.
 • "ఔ,రౌర! జగజంత యని తెల, వారుటఁ గని భామ కేళివసతికిఁ జనియెన్." హంస. 3. 243.

జగజంపు

 • ముత్యాల కుచ్చు - పెద్దది...

జగజెట్టి

 • జగదేకవీరుడు. హర. 3. 92.
 • "జెట్టి సింగారించుకొనే టప్పటికి పట్నం కొల్ల పోయింది." సా.

జగజోలి ఏల

 • (ఈ) జంజాటము (ఈ) పీకులాట ఎందుకు?
 • ఎవరి సంగతో మన కెందుకు?
 • "చాలు చాలును వట్టి జగజోలిమాట, చాలింపుమా." రంగ. రా. అయో.
 • "ఎక్కడి జగజోలి యటంచు నెరసి చన జూతురు." శుక. 3. 127.
 • "ఫలము వారలొ కాక పనిమాలినట్టి, చలమువారలొ వట్టి జగజోలి యేల." ద్వి. పరమ. 7.