పుట:PadabhamdhaParijathamu.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంయతితో స్ఫురింపజేసే అర్థం. కలది వానితో చేరినప్పుడే అవుతుంది.

మిన్ను దన్నుటలో, తల దన్నుటలో, జిగి తన్నుటలో తన్నుట మన మామూలు తన్నుట కాదు. చెట్లు వట్టు, తిప్పలు వట్టు, కొండలు పట్టు వగైరాలు అవొక విశిష్ట భావద్యోతకాలు.

అట్లే అవసర మిచ్చుట, పూజ యిచ్చుట, చెఱయిచ్చుట, అనుజ్ఞ యిచ్చుట, మొల యిచ్చుట, దళమిచ్చుట ఇత్యాదులు. ఎన్నిరకాల రీతులనో అపూర్వపద విశిష్టసాన్నిహిత్యంతో యూ యిచ్చు అర్థ మిస్తున్నది.

చెఱపట్టుట చెఱను పట్టుట కాదు కదా! కొమ్ములు సూపుట కొమ్ములను చూపుట కాదు కదా.

ఇలా అనేకంగా వున్నవి.

మఱి కేవలం ధ్వన్యనుకరణాలై వచ్చినవి చాలానే కలవు. కొఱకొఱ లాడు, మెఱమెఱ లాడు, పటపట పండ్లు కొఱకు, చిటపట వాన కురియు ఇలాంటివి.

అర్థవైలక్షణ్యం లేకున్నా ఒకే రూపంలో ఉండే కనుముక్కుతీరు, అరిషడ్వర్గాల వంటివి కొన్ని.

ఇవన్నిటినీ చేర్చి నుడికారాల నిఘంటువును వేఱుగా తయారు చేయవలెన్నన్న సంకల్పం కేవలం గ్రంథస్థమైన వానిని ఒకచో చేర్చుటకే కాక, అసలు గ్రంథస్థం కానివీ, నిఘంటువుల కెక్కనివీ వందలూ వేలూ ఉండిపోగా వానిని చేర్చుటకూ అయి ఉన్నది.

ఆంగ్లాది ఇతరభాషలలో కోశనిర్మాతలు ఆ యా ప్రధానపదాల క్రిందనే, ఆ పదం కొలికిపూసగా ఏర్పడిన సుడికారాల నన్నిటినీ విశేషార్థవివరణలతోపాటు ఇస్తూ వస్తారు.

మన కోశాలలో సూర్యారాయాంధ్ర నిఘంటువు (జన్యపదాలు), వావిళ్ళ నిఘంటువు కొన్నిటిని ఇవ్వవలె నని ప్రయత్నించినా ఆ పని సమగ్రం కాలేదు. అసలు కేవలం