పుట:PadabhamdhaParijathamu.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలాగే మనం నిత్యం చూస్తున్న పశుపక్ష్యాదుల నుండి కొన్ని ఏర్పడినవి. గోడమీది పిల్లి, దీపంముందు బల్లి మొదలు, కోతికి కొబ్బరికాయ చిక్కినట్లూ, కుక్కలు కాట్లాడుకున్నట్లూ మొదలు, కాలు ద్రవ్వడం, గర్జించడం మొదలు, దున్నమీద వాన కురిసినట్లు వఱకూ అనేకం ఇలా వచ్చినవి.

తాము గమనిస్తున్న పరిసర ప్రకృతి ప్రభావ పరిజ్ఞానం నుంచీ ఎన్నో వచ్చినవి. ఇసుక వేస్తే రాలనంత జనం మొదలు సూదిమొన మోపడానికి వీలు లేకుండా వఱకూ, వర్షం వెలసినట్లుగా సద్దు మణగడం మొదలు కుండపోతగా కురవడందాకా ఇవి ఉన్నవి.
అఱచేత్తిరేకలు కనిపిస్తున్న వనుటతో వేకువ నతను ముచ్చటగా చెప్తాడు. కాదారి మాదారి ప్రొద్దని చీకటిని సూచిస్తాడు. ఎంత గొప్పకవి మనిషి!

ఇలా ఏర్పడిన నుడికారాలు కాక, కేవలం ఊది చెప్పుటకూ, నొక్కి వక్కాణించుటకూ కొన్ని జంటపదాలను తను సృష్టించుకున్నాడు. ఒకప్పు డామాటను కాస్త అందంగా అనడంవఱకే అయినా సరే అనువదించుకున్నాడు.

నగా నట్రా, పురుగూ పుట్రా, సుళువూ ఒళువూ: ఇలా ఎన్నెన్నో వెలసినవి. పరువు అన్నా, ప్రతిష్ఠ అన్నా ఒకటే. అయితే నేం? పరువూ ప్రతిష్ఠా ఉన్న కుటుంబం అనుటలో ఒక విలక్షణపదబంధం ఏర్పడినది.

ఇలాంటివి కాక శబ్దపల్లవక్రియ లెన్నో విశిష్ట విలక్షణస్ఫూర్తితో నుడికారాలలో చేరినవి.

చన్నిచ్చుట చన్ను నిచ్చుట కాదు;కొండ చేయుట కొండను చేయుట కాదు; పీట పెట్టుట పీటను పెట్టుట కాదు. సరే. నోరు చేయుట నోరును చేయుట అని తెనుగు వా డనుకోగలడా?

అట్లే కయ్యము పొడుచుట, అప్పు పొడుచుట, ఆన పొడుచుట మొదలగువానిలోని పొడుచుట ఆ విశిష్టపద