పుట:PadabhamdhaParijathamu.djvu/762

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీక - చీకు 736 చీకు - చీకు

చీకట్లు గొలుపు

  • అంధకారబంధుర మగు.
  • "కదన మంతయును జీఁకట్లు గొలుప." జైమి. 2. 70.

చీకాకు చేయు

  • చిక్కు పెట్టు; కలత పెట్టు.
  • "పై మిన్ను వ్రాలినఁ బదరని ధైర్యంబుఁ, గటకటా కలఁచి చీకాకు చేసె." చంద్రా. 4. 96.
  • శుక. 1. 170.

చీకాకు పడు

  • 1. గందరగోళ పడు.
  • "ఆకు లే వంకఁ జీకాకు పడెనొ." విప్ర. 3. 67.
  • 2. కలత చెందు. శివ. 1. 58.

చీకాకు పఱచు

  • కలత పెట్టు; చిక్కు పెట్టు.
  • "అహితసేనల నెల్లఁ జీకాకు పఱచి." జైమి. 2. 28.

చీకిరికండ్లు

  • చూ. చీకటికండ్లు.

చీకిలిమాకిలిగా

  • అడ్డదిడ్డముగా.
  • "...మదిన్ విచారింపకు చీ,కిలి మాకిలిగా నల్లిన, చెలఁది తెరల్ సూచి సంతసించుట లేదే?" సారం. 1. 15.

చీకుకొక్కెర

  • ఒక జాతి కొంగ. శ. ర.

చీకు పర్వు

  • అంధకారబంధుర మగు.
  • "నభ మంతయుఁ జేకొని చీఁకు పర్వ న,క్తందినచిహ్నముల్ మఱవఁగా." సింహా. 3. 98.

చీకుబండ

  • జాఱుడు బండ. నిరం. 2. 69.

చీకురాయి

  • ఒక జాతి గబ్బిలము; ఇలకోడి.
  • చూ. చీకురువాయి.

చీకురువాయి

  • చూ. చీకురాయి.

చీకు లావుకం ద్రొక్కినయట్లు

  • కాకతాళీయముగా. గ్రుడ్డివాడు లావుకను తొక్కినట్లు. అనగా యాదృచ్ఛికంగా అనుట.
  • అంధలావుకన్యాయం అని సంస్కృతంలోనికీ ఎక్కి న దిది.
  • నేటికీ రాయలసీమలో వాడుకలో 'గుడ్డోడు యర్రెలకను దొక్కినట్టు వా డెట్లెట్లో ఈ ఒక్కసారీ గెల్చాడు పందెం' అను రీతిగా ఈ పలుకుబడి వినవస్తుంది.
  • 'ఎర్రెలక' ను అన్నట్లే 'ఎర్లావుక' ను అనీ అంటారు. కన్నడంలో 'కురుడం లావుగెయం మెట్టి దంతె' అని సామెత.