పుట:PadabhamdhaParijathamu.djvu/761

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీక - చీక 735 చీక - చీక

 • "చీఁకటితప్పు చేసిన సరోరుహ నేత్ర, గూబ యై వసియించుఁ గోటరమున." కాశీ. 2. 80.
 • "అమరవల్లభుఁడు గౌతముకూర్మి యిల్లాలిఁ, జీఁకటితప్పు సేసినవిధంబు." నైష. 7. 151.

చీకటి త్రవ్వు

 • 1. వ్యర్ధప్రయత్నము చేయు. చీకటిలో వెదకుట అలాంటిదే కదా.
 • "జీవులు ని న్నెఱుంగక చీఁకటి ద్వాఁగ నేల." తాళ్ల. సం. 6. 182.
 • 2. వ్యర్థాలోచనలు చేయు.
 • "చీఁకటి ద్రవ్వెద వేలె? చీఱినఁ బలుక వదేలె? తాళ్ల. సం. 4. 53.

చీకటిదొసగు

 • చీకటితప్పు.
 • "....చీకటిం దొసంగులె లలిఁ గౌరువా రయిన గొబ్బునఁ గాంత్రు విరక్తి ముక్తి..." భాగవతమాహాత్మ్యము.
 • చూ. చీకటితప్పు.

చీకటి నెత్తిన వేసుకు వెళ్లు

 • చీకటిలో వెళ్లు. కొత్త. 345.

చీకటి పడు

 • 1. శూన్య మగు, నిస్తేజ మగు.
 • "చిత్తము చీఁకటి వడెను." తాళ్ల. సం. 8. 50.
 • 2. సాయంత్ర మగు.
 • "అప్పుడే చీకటి పడింది. ఇంటికి వెళ్ళాలి." వా.

చీకటిపా లగు

 • వ్యర్థ మగు, పా డగు.
 • "చిందరాని నా బుద్ధి చీఁకటిపా లాయె." తాళ్ల. సం. 8. 30.

చీకటి మొటికళ్లు

 • చీకటి మొట్టికాయలు. ఒక రకమైన పిల్లల ఆట.
 • "చీకటిమొటికళ్లు చిమ్ముబిల్లలు." విష్ణు. 7. 202.
 • చూ. చీకటి మొట్టికాయలు.

చీకటి మొట్టికాయలు

 • ఒక పిల్లల ఆట. తలమీద బట్ట కప్పి మొట్టికాయ మొట్టి, ఎవరు మొట్టిరో తెలుసుకొను మను ఆట.
 • చూ. చీకటి మొటికిళ్లు.

చీకటియీగ

 • చిన్న యీగ.
 • రూ. చీకటీగ.

చీకటులు త్రవ్వించు

 • అనవసరముగా శ్రమపడ జేయు.
 • "నే, నెవ్వాఁడం బరమాత్మ గాక పిస వెఱ్ఱీ! విప్ర! యీ చీఁకటుల్, ద్రవ్వింపం బని లేదు సుమ్ము మము బోంట్లన్ వీరి వారింబలెన్." వరాహ. 2. 18.
 • చూ. చీకటి త్రవ్వు.

చీకట్లుకొను

 • చీకటి పడు.
 • "గరము భూనభోంతరము చీఁకట్లు గొనియె." కళా. 4. 89.