పుట:PadabhamdhaParijathamu.djvu/763

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీకు - చీటి 737 చీటి - చీడ

 • "అక్కజ మై మహార్థ నివహంబు సదుక్తులు మెచ్చఁ జూచినన్, గ్రుక్కిద మైన సత్కృతి యగు ర్పగుఁ గా కిలఁ జీకు లావుకం, ద్రొక్కిన యట్లు నోటి కొలఁదుల్ పురికొల్పఁగ నందులోన నొ,క్కొక్కఁడు సక్క నైనఁ గృతియుం గృతి యందురె వాని మెత్తురే." కుమా. 1. 38.

చీకు వట్టిన కోల

 • గ్రుడ్డివాని చేతికఱ్ఱ. ఒకరి సాయము లేనిది పనికి రానిది.
 • "భావదేవర ! చీఁకు వట్టిన కోల, ఏ వచ్చువిధ మెట్టు లింక ముందఱికి." పండితా. ద్వితీ. మహి. పుట. 112.

చీకువాలు

 • చీకటి.
 • "నీలి గుడిపినక్రియఁ జీకువాలు గవిసె." కుమా. 8, 94.

చీకొట్టు

 • చీచీ యని దండించు, తిట్టు.
 • "చీకొట్టుదు రందఱును గుచేలుం డైనన్." కుచే. 2. 32.

చీటికి మాటికి

 • 1. మాటిమాటికి.
 • చీటికి మాటికిన్ నిఖిలజీవులునుం బొనరించుపాపముల్." శృం. నైష. 7. 76.
 • 2. ప్రతి చిన్నదానికి, అల్ప విషయాలకు.
 • "అత్తల మామలన్ మగల నన్నలఁ దమ్ములఁ దల్లిదండ్రులన్, జిత్తుల దుద్దు బెట్టుచును జీటికి మాటికి నన్నె చేరఁగా, వత్తురు మేలు కర్జములు వంతుల కిత్తురు నిండుకౌఁగిటం, గ్రుత్తురు మారుకేళి ననుఁ గూడుచు మెత్తురు మత్తచిత్తలై." దశావ. బల. 328. పు.
 • "చీటికి మాటికిఁ జెడుదురే బుధులు." రంగ. రామా. అర. 155. పు.
 • "ఆవిడ చీటికి మాటికి తగువుకు వస్తుంది." వా.
 • "వాడు చీటికి మాటికి అమ్మదగ్గిరికి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు." వా.

చీటి వ్రాయు

 • ఎదుటివానికంటె ఉన్నతుడగు; మించు.
 • ఉత్తర ప్రత్యుత్తరములు నడుపు అనే వాచ్యార్థంపై ఉత్తరువు లివ్వగలుగుగా సాగినమాట.
 • "సంభ్రమంబున నాకారసౌష్ఠవమున, వాఁడు కందర్పునకుఁ జీటి వ్రాయఁ గలఁడు." హంస. 5. 204.
 • "హత్తుకో వచ్చు నీ వంటి యందగాని, కున్న దొకచోట నొక మంచి యొఱపులాఁడి, దాని కిలికించితమ్మునఁ దగిలినట్టి, వాఁడు దేవేంద్రునకుఁ జీటివ్రాయఁ గలఁడు." శుక. 4. 179.

చీడకు చింత గోడకు కోపము

 • ఇరువైపులా బాధే అనుట. కృష్ణనీ. 74.

చీడపురుగు

 • 1. పంటను పాడుచేసే పురుగు.
 • "ఈసారి చీడపట్టి పంట పాడయినది." వా.
 • 2. వేరుపురుగు వంటివాడు.
 • "ఆ చీడపురుగును నీ వ్యాపారంలో చేర్చుకున్నావా పాడయి పోతావు." వా.