పుట:PadabhamdhaParijathamu.djvu/757

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలు - చిలు 731 చిలు - చిలు

చిలుకకొట్టు

  • చిలుక కొట్టిన, లోని సారము పీల్చి వేయబడిన కాయ.
  • "ఈ చిలుకకొట్టు తట్టలను మండిగల వైచి యీతఁడు గాడి ప్రొయ్యిపై వేయించును." సాక్షి. 267. పు. 3. పం.
  • "ఈసారి మాయింట్లో సగం కాయలు చిలుకకొట్టులే." వా.

చిలుకకొట్టుడు

  • పిల్లలు తాము తింటున్నది మరొకరికి పంచి పెట్టేటప్పుడు, ఎంగిలి కాకూడ దని, ఏ బెల్లం ముక్కమీదనో బట్ట వేసి కొఱికి, ఆ ముక్క నిస్తారు. దానిని చిలుకకొట్టుడు, చిలుక కొఱుకుడు అంటారు.
  • చూ. కాకియెంగిలి.

చిలుకకొయ్య

  • బట్టలు తగిలించుట కైన కఱ్ఱ ముక్క.

చిలుకగోణము

  • అతుకులగోచి. బ్రౌన్.

చిలుక, గోరువంకవలె నుండు

  • అన్యోన్యంగా ఉండు. ముఖ్యంగా దంపతుల విషయంలో ఉపయోగిస్తారు.
  • "వాళ్లిద్దరూ చిలకా గోరువంకల్లాగా కాపరం చేస్తుంటే చూడ ముచ్చ టవుతుంది." వా.

చిలుకచదువు

  • చెప్పిన మాట మాత్రమే చెప్పుట. స్వబుద్ధి రాహిత్యమును తెలుపు పలుకుబడి.
  • "చిలుకచదు వనుట చదివిన ములుచకు...." కళా. 6. 270.
  • చూ. చిలుకపలుకలు.

చిలుకతాళి

  • ఒకరక మైన పతకము.

చిలుక నక్కున బెట్ట చెక్కు సెమర్చు

  • సుకుమార మయిన. చిలుకను కూడ మోయ లేని దనుట.
  • "చిలుక నక్కునఁ బెట్టఁ జెక్కు సెమర్చు, నెలనాఁగ నందను నెట్లెత్తి తెచ్చె." గౌర. హరి. ప్ర. 1597-98.

చిలుకపలుకలు

  • విన్న మాటలు.
  • స్వాలోచనా రహితము లనుట.
  • "వాడి వన్నీ వట్టి చిలక పలుకులు. వాళ్లమామ ఏది చెప్తే అదే." వా.

చిలుక పోయిన పంజరము

  • వ్యర్థము.
  • చిలుకే లేనప్పుడు పంజర మెందుకు అనుటపై వచ్చిన పలుకుబడి.
  • "చిత్త మె,ల్లం జెడి యుండ రిత్తయొడలం జవి చేరునె చిల్క వోయినం, బంజర మేమి సేయ." ఉ. హరి. 1. 72.