పుట:PadabhamdhaParijathamu.djvu/756

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిఱ్ఱు - చిఱ్ఱు 730 చిల - చిలి

చిఱ్ఱుది

 • జత.

చిఱ్ఱు బుఱ్ఱు మను

 • బుసకొట్టు, కోపించు.
 • "కట్టిన పులితోలు కడకొంగు సోఁకి యాఁ, బోతుతత్తడి చిఱ్ఱు బుఱ్ఱు మనఁగ." హర. 5. 16.

చిఱ్ఱు బుస్సను

 • కోపపడు - కసరుకొను.
 • కోపపడుటలోని ధ్వన్యనుకరణము.
 • "ఆ మండోదరి చిఱ్ఱు బుస్సను చసూయాక్రాంత యై పోయి యే,మేమో వేఁడెడు బిడ్డలం గదిసి..." శుక. 3. 274.

చిఱ్ఱు మను

 • కోపించు.

చిఱ్ఱు ముఱ్ఱాడు

 • 1. చిందఱ వందఱ చేయు.
 • "క్రొవ్విరు లెక్కి చిఱ్ఱు ముఱ్ఱాడుచు." కుమా. 9. 102.
 • 2. పెనగులాడు.
 • "అనుచుఁ గొందలపడు కోర్కు లగ్గలించి, చిఱ్ఱు ముఱ్ఱాడుచుండ నచ్చెలువ చెలువు." భార. విరా. 2. 85.
 • 3. చీల్చి చెండాడు.
 • "చేకొని శవములఁ జిఱ్ఱు ముఱ్ఱాడు, కాకఘూకానేకకంకగృధ్రములు." రంగ. రామా. యుద్ధ.

చిఱ్ఱు ముఱ్ఱు మను

 • కోపించు.
 • "ఏ నటు చిఱ్ఱుము ఱ్ఱనుచు నించుక కోపము తాళ లేమి." విప్రనా. 2. 71.
 • చూ. చిఱ్ఱు ముఱ్ఱాడు.

చిలచిల మను ధ్వన్యనుకరణము.

 • గందపూత ఎండి పేట్లు రేగునప్పు డగు ధ్వని సూచిస్తూ - ఇక్కడ:
 • "సిరి నందపు టస లొకింత చిల చిలా మని వే,గిరమ వఱువట్లుగొనఁ గడుఁ, బొరలెడి తరలాక్షి తాపముం గని కలఁకన్." కళా. 6. 255.

చిలవలు పలవలు చేయు

 • ఒకటి ఉంటే నూరు కల్పించు.
 • "కోడలు ఏదో అన్నదని చిలవలు పలవలు చేసి వాళ్ళత్త కొడుకుతో కొట్టించింది." వా.

చిలివిలివోవు

 • 1. ఎక్కువగు, సుళ్ళుతిరుగు.
 • "చిలివిలివోవు మచ్చికలు పిచ్చిల్ల." పండితా. ద్వితీ. మహి. పుట. 133.
 • "చిలివిలివోవు కోరికలు చిత్తమునం దల లెత్త." విక్ర. 4. 224.
 • 2. బలపడు; దట్ట మగు.
 • "మానితభక్తి సామ్రాజ్యసంపదలు, సిలివిలి వోవ." బస. ప్రథ. పుట. 2.
 • "శివభక్తి సంపదల్ సిలివిలి వోవ." బస. 7. 196.

చిలివిసము

 • పనికిమాలిన పని.
 • "చిలివిసంబులు కొన్ని చేయు చున్నాఁడు." ద్వి. పరమ. 5. 361.