పుట:PadabhamdhaParijathamu.djvu/758

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలు - చిలు 732 చిలు - చిల్క

చిలుకముక్కు

 • 1. చిలుకముక్కువంటి ముక్కు.
 • 2. ధాన్యవిశేషం.
 • 3. ఒక చెట్టు.

చిలుక మెట్టని ఫలములు

 • చిలుక కొట్టని పండ్లు.
 • "చిలుక మెట్టని ఫలంబులు కోసికొని వచ్చి, పరికించి యారగింపఁ బెట్ట.... వేడ్క యయ్యెడు." శివ. 3. 55.

చిలుకయారె

 • చెప్పులు కుట్టే సూది.

చిలుకలకొలికి

 • సుందరి. నైష. 8. 50.

చిలుకలకొల్కి

 • అందగత్తె.
 • "చిలుకలకొల్కి కల్కి యొక చేడియ నాటకసాల మేడపై." మను. 5. 63.

చిలుకుటమ్ము

 • ఒకరక మైన బాణము

చిలుకుడు గుంజ

 • పెరుగు చిలుకునప్పుడు కవ్వం కట్టే గుంజ.

చిలుప చిలుపను

 • చిలచిల మను. ధ్వన్యనుకరణము.
 • "చిలుప చిలుపని నేతులు జిడ్డు దేఱు, నేమి చెప్పుదుఁ గ్రొవ్విన యేకలములు." మను. 4. 17.

చిలుపచిలుపగా (నెత్తురులు)

 • బొళబొళ మని. ధ్వన్యనుకరణము.
 • "పంతంబులు వదలించియుఁ జిలుప చిలుప నెత్తురుల జొత్తిల్లిన నేలం గా లూఁద నేరక జీఱువాఱియు." ఉ. హరి. 43. 27.

చిలువానపుమిద్దె

 • ఉగ్రాణంకొట్టిడీ, చిల్లర వంట సామా నుంచే గది.
 • "వంటకొట్టము చిలువాన ముంచిన మిద్దె." శుక. 3. 48.

చిలువాయనము

 • చిల్లర - క్షుద్రము. పాండు. 2. 85.

చిలువాల పాయసము

 • పాల పరమాన్నం. చంద్ర. 4. 77.

చిల్కకు చక్కెర వెట్టు

 • చిలుకకు ఆహార మిచ్చు.
 • "లలనా! చక్కెర వెట్టవే యనుచుఁ జిల్కల్ సారెకుం బల్కఁగా." రాజగో. 2. 10.

చిల్కలకొల్కి

 • అందగత్తె.
 • "అనుచుం జిల్కలకొల్కి పల్క విని యత్యానంద మిం పొంద ని, ట్లనియెన్." శుక. 1. 493.
 • చూ. చిలుకలకొల్కి.

చిల్కల చదువులు

 • అర్థం తెలియని చదువులు.
 • "చదువు లివి యెల్లఁ జిల్కల చదువు లనుచు." పాండు. 3. 36.