పుట:PadabhamdhaParijathamu.djvu/755

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిఱి - చిఱు 729 చిఱు - చిఱ్ఱి

చిఱిగోరు

  • ఒక రకమైన దుంప.

చిఱుగాలి

  • మందమారుతము.

చిఱుగూబ

  • పైడికంటి అనే పక్షి. శ. ర.

చిఱుతగండు

  • చిఱుతపులి.
  • మగ చిఱుత అని కొన్ని కోశాలన్నా వాడుకలో చిఱుతలను చిఱుతగం డ్లని సర్వసామాన్యంగా అంటారు.

చిఱుతనవ్వు

  • చిన్న నవ్వు.

చిఱుతనాడు

  • చిన్న నాడు.

చిఱుతపఱచు

  • చిన్నవిగా చేయు.
  • "అభ్రంకషము లైన యానశిరశ్శృంగ, శృంగాటకము లిట్లు చిఱుతపఱచి." కాశీ. 2. 163.

చిఱుతపోవు

  • 1. చిన్నపోవు.
  • "తఱి దప్పె నైన నిత్తఱి నన్ను నడిగి, చిఱుత పోవుదు వేని." వర. రా. అయో. పుట. 387. పం. 8.
  • 2. మొక్క పోవు, చిన్నదగు.
  • "చిఱుత వోయిన మూఁకుటి చెలువుఁ దాల్చి." కాశీ. 1. 138.

చిఱుతిండి

  • తినుబండారము. పై తిండి.

చిఱుతొడ

  • పిక్క.

చిఱునవ్వు

  • చిన్న నవ్వు.

చిఱునాలుక

  • కొండనాలుక.

చిఱుపాలు

  • మీగడ.
  • "చే సురు,క్కను నేయుం జిఱుపాలు వెల్లువుగ నాహారం బిడన్." ఆము. 1. 82.

చిఱుపులి

  • చిఱుతపులి.

చిఱుబంతి పసుపు

  • చాయపసుపు.

చిఱువాడు

  • మిగిలిన చిల్లరడబ్బులు. శుక. 3. 117.

చిఱుసాన

  • పదును పెట్టే సాన.

చిఱ్ఱగొట్టు

  • కోపిష్ఠి.

చిఱ్ఱ చిఱ్ఱ

  • తొందర.

చిఱ్ఱలు వొడుచు

  • తొందరపడు.

చిఱ్ఱిపట్టె

  • ఒక పిల్లల ఆట.