పుట:PadabhamdhaParijathamu.djvu/754

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిమ్ము - చిరు 728 చిరు - చిఱి

చిమ్ములాట

  • నీళ్ళు చల్లుకునే ఆట.

చిమ్ములాడు

  • నీళ్ళు చల్లుకొను.

చిరంజీవి......

  • పిల్లలయెడ, చిన్నవారియెడ పెద్ద లుపయోగించే మాట.
  • "చిరంజీవి కుమారుడు." వా.
  • ఉత్తరాల్లో చిన్నవారి పేరు ముందుకూడా వ్రాస్తారు.
  • "చిరంజీవి సుబ్బారావుకు." వా.

చిరతవాలుగా

  • చిఱుతప్రాయంలో వలె. కాశియా. 307.

చిరమరలు

  • భేదాలు.
  • "చెలిమి వేర్పా టను చిరమరలకుఁ జొరక." భార. శాంతి. 1. 58.

చిరాకుపడు

  • విసుగుకొను.

చిరుతలు కవియు

  • మిరుమిట్లు గొను.

చిరుతలు క్రమ్ము

  • మిరుమిట్లు గొలుపు.

చిరుతలు వాఱు

  • మిరుమిట్లు గొలుపు.

చిరునామా

  • జాబులమీద వ్రాసే విలాసం.
  • చూ. పై విలాసము.

చిరువడముల పాకము

  • చిన్న చిన్న ఉండలుగా గోధుమపిండితో చేసి పాకంలో వేసిన పిండివంట. నైష. 6. 113.

చిర్నవ్వు

  • చిఱునవ్వు.

చిర్రుబుర్రులు

  • విసుగు వేసటలు; కోప తాపాలు. జం.
  • "వినన్ రాదె యీ చిర్రుంబుర్రులిఁ కేల." గీర. 27.

చిర్రు ముర్రాడు

  • ముందువెనుక లాడు.
  • "అరిది సిగ్గులు చిర్రుముర్రాడు నోర, చూపుగొనలను...." రాధా. 4. 68.

చిఱచిఱలాడు

  • కోపించు, మండిపడు. మృ. వి. 3. 53.
  • "పొద్దున్నుంచీ ఆకోడలమ్మ చిఱచిఱ లాడుతూ ఉంది నాయనా." వా.

చిఱలు వొడుచు

  • బుసకొట్టు.
  • పశువులు మొదలగునవి చెలరేగి గంతులు వేయు.
  • "చిఱుపెండ వెట్టుచుఁ జిఱలు వొడ్చుచును." బసవ. పు. 160.

చిఱిగినవిస్తరి

  • నానాబీభత్స మై పోయినట్టిది.
  • "వాళ్ళ అమ్మా నాన్నా పోయినప్పటి నుండీ ఆ పిల్లబ్రతుకు చిఱిగిన విస్తరి అయిపోయింది." వా.