పుట:PadabhamdhaParijathamu.djvu/749

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిది - చిన్న 723 చిన్న - చిన్న

వీరి కెల్ల నడుగిడ నమరా, వతిఁ బట్టు లేదు వరసుర, సతు లందఱఁ జిదిమి పెట్టఁ జాలరు వరుసన్." కుమా. 11. 180.

  • చూ. బుగ్గ చిదిమి దీపము పెట్టు.

చిదిమి వైచు

  • ఛిన్నాభిన్నము చేయు.
  • "చిచ్చఱయమ్ముల చిదిమి వై చెదవె?" వర. రా. అర. పు. 237. పం. 1.

చిన్న కన్నుపడు

  • కను లఱమోడ్పు చెందు.
  • "చిన్న కన్నువడి దుప్పులు చప్పుడు గాక యుండ." సాంబో. 2. 188.

చిన్నకారు

  • బాల్యము. బ్రౌన్.

చిన్నకూతురు

  • చిన్నది.
  • "ఎన్ని నాళ్లైనఁ జిన్న కూఁ,తురవు గావు నీవె తొడఁగి పతికిఁ దగిన సేవ సేయ కగునె..." కళా. 4. 68.

చిన్నక్క పెద్దక్క చేయు

  • మోసగించు.
  • వర్తకంలో చిన్న శేరు పెద్ద శేరు వాడే అతను, చిన్నక్కా శేరు తేవే అంటే చిన్న శేరు తేవా లనీ, పెద్ద క్కా శేరు తేవే అంటే పెద్ద శేరు తెమ్మనీ గుర్తు పెట్టి వ్యాపారం నడిపేవా డట. ఆ మోసం పై వచ్చిన పలుకుబడి.

చిన్నగ బోవు

  • చిన్నబోవు. శివ. 2. 19.
  • చూ. చిన్నబోవు.

చిన్నచూపు చూచు

  • చులకన చేయు.
  • "మామీద అంత చిన్నచూపు చూస్తే ఎలాగు చెప్పండి." వా.

చిన్నటనాడు

  • చిన్ననాడు. బాల్యం.
  • "చిన్నటనాఁట నుండియును జెల్వకుఁ గూర్చినదాన వౌట." వసు. 4. 106.

చిన్నతన మగు

  • అవమాన మగు.
  • "తప్పు లెన్నును చిన్నతన మగు నాకు." పల. పు. 62.
  • వాడుకలో - 'అందఱు సంపన్నులలో ఈ మాసినబట్టలతో తిరగడం నాకు చాలా చిన్నతనంగా ఉంది.'

చిన్ననవ్వు

  • చిఱునవ్వు.
  • "చిప్ప కూఁకటివానిఁ జిన్న నవ్వుల వాని." పాండు. 1. 213.

చిన్ననాటి కతలు

  • గతచరిత్ర.
  • "ఎలదోఁట తీఁగె యుయ్యెల, కలకంఠికిఁ జిన్ననాఁటి కత లై తోఁచెన్." శివరా. 2. 46.

చిన్న నాడు

  • బాల్యం.