పుట:PadabhamdhaParijathamu.djvu/750

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్న - చిన్న 724 చిన్న - చిన్న

చిన్న పడుచు

  • బాలిక.

చిన్న బుచ్చు

  • అవమానించు.
  • "నన్ను చిన్నబుచ్చినకంబు పెద్ద సేయంగ." కవిక. 2. 164.
  • "నడుమంత్రమున వచ్చి ననుఁ జిన్న బుచ్చి." వర. రా. అయో. 2. 533. పం. 2.
  • చూ. మొగ మింత చేసికొను, మొగము చిన్న చేసికొను, మనసు చిన్న బుచ్చుకొను.

చిన్నబోవు

  • 1. అవమానముతో మొగము చిన్న చేసికొను.
  • "ఏఁగుదెంచిన నృపు లెల్ల నిండ్ల కరుగఁ, జేరి యధికారు లెల్లను జిన్నఁబోవ." శుక. 2. 12.
  • 2. విఘాత మగు.
  • "చేతనా హానికార్యంబు చిన్నబోయె." నైష. 4. 96.
  • 3. కళావిహీన మగు.
  • "సంపద లెన్ని గల్గిన నరేంద్రా యింద్ర సంకాశ నం,దనుఁ డొక్కండును లేమి నా నగరు చిన్నంబోయె." వరాహ. 2. 92.
  • "పిల్ల లందరూ ఊరి కెళ్ళే సరికి ఇల్లు చిన్నబోయింది." వా.

చిన్న మంత మాట ఆడు

  • ఏ కించిత్తైనా దండించు, ఒక మాట అను.
  • చిన్నం పూర్వపు తూకపు రాళ్లలో అతిచిన్నది.
  • "చిన్న నాఁడును బ్రియు నొక చిన్న మంత, మాట యాడిన విని తాపమగ్న వగుదు." కళా. 4. 128.

చిన్నమ్మవారు

  • మశూచికములో ఒక భేదము.
  • పెద్దమ్మ, చిన్నమ్మ, బొబ్బలమ్మ, ఆటలమ్మ, తట్టమ్మ ఇత్యాదులు మశూచికంలో భేదములు.

చిన్నమూ చిదరా జం.

  • అల్ప మైనవి.
  • "చిన్నముఁ జిదరయుఁ బుట్టక, మిన్నక రావలసె మగుడి మీ రున్నెడకున్." పంచ. మి. భే. 522.
  • పూర్వం తూకంలో చిన్నము అతి చిన్నది.

చిన్న మెత్తు పని లేదు

  • ఏ పనీ లేదు.
  • ఇది వ్యతిరేకార్థంలోనే ఉపయోగిస్తారు.
  • "వాడికి చిన్నమెత్తు పని లేదు."
  • "పొద్దున్నుండీ చిన్నమెత్తు పని కాలేదు." వా.

చిన్నమెత్తు మాట అనకుండు

  • ఒక్క మా టైనా వ్యతిరేకంగా అనక పోవు. పల్లెత్తుమాట అనకుండు.
  • "నేను చిన్నమెత్తు మా టయినా అన