పుట:PadabhamdhaParijathamu.djvu/748

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తు - చిదం 722 చిద - చిది

బొమ్మలూ అవీ చేసి వానికి రంగు వేసే పని.

  • ఈ వృత్తి చేయువారిని చిత్తారివాండ్రు అంటారు.

చిత్తుప్రతి

  • సాపు వ్రాయక ముందు వ్రాసుకున్న ప్రతి.

చిత్తుళిపని

  • చిత్తారిపని.
  • కర్రబొమ్మలు మొదలగు వానిపై రంగులు వేయుపని. జీనిగర - చిత్తారి - వాండ్లు అని ఆ పని చేసేవారి నంటారు. కాశీయా. 304.
  • చూ. చిత్తారిపని.

చిత్రరతి

  • సంభోగములో భేదము. కుమా. 9. 152.

చిదంబరరహస్యము

  • అగోచరము - అనవగతము. చిదంబరంలోని శివలింగాన్ని ఆకాశలింగం అంటారు. దర్శనానికి వచ్చిన భక్తాదులను, తెర తొలగించి, దర్శనం అయిందా అంటారు. వీరు అయింది అంటారు గానీ యెవరికీ యేమీ కనబడదు. ఆకాశలింగం కనుక కనబడదని ప్రతీతి. అందుపై యేర్పడిన పలుకుబడి.
  • "అంత సరిపడనివాడు ఈ రోజు ఉద్యోగం యిస్తా నన్నా డంటే యిందులో యేదో చిదంబరరహస్యం ఉంది." వా.

చిదగొదలు

  • గృహకలహము. బ్రౌన్.
  • వ్యత్యాసాలు. వావిళ్ళ ని.
  • "మొదల నుపాయం బెన్నుట, పిదప నుపాయంబు లెక్క పెట్టుట తగునీ, చిదగొదలఁ గాదె ము న్నొక, ముది కొక్కెర యనుఁగుసుతుల ముంగిస కిచ్చెన్." వేంక. పంచ. 1. 738.

చిదమిదగా

  • నలుగునట్లుగా; కసిబిసిగా.

చిదిమి దీపము పెట్టవచ్చు

  • ఎంతో ప్రకాశవంతంగా ఉన్న దనుపట్ల అనే పలుకుబడి.
  • "ఆ పిల్లను చిదిమి దీపం పెట్టవచ్చు." వా.

చిదిమి పెట్టిన

  • 1. సారము తీసిన. చిలికి తీసిన - ఆరితేరినగా మారినది.
  • "ఆ, భీలశరాతనుల్ చిదిమిపెట్టిన బంటులు." విజయ.
  • 2. రూ పొందించిన.
  • "బిడ్డయొ పాపయో చిదిమి పెట్టిన కైవడి నున్న నిన్ను." శుక. 1. 527.

చిదిమి పెట్టు

  • పంచు.
  • "మృతు లైనవీరు లందఱు, నతివీరులు