పుట:PadabhamdhaParijathamu.djvu/747

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్త - చిత్త 721 చిత్త - చిత్తా

చిత్తమున కెక్కు

  • మనసునకు వచ్చు, నచ్చు.
  • "అకట ! యొరు చిత్తమున కెక్కునట్లు గాఁగ, మెలఁగి యేమివిధంబునఁ గొలుచువాడు." భార. విరా. 1. 74.

చిత్తము నీరగు

  • గుండె నీరగు; భయభ్రాంతి జనించు.
  • "అక్కటా !, నిక్కము మాకుఁ జిత్తములు నీ రగుచున్నవి." ఉ. హరి. 2. 132.

చిత్తము వచ్చినట్లు

  • స్వేచ్ఛగా, యథేచ్ఛగా.
  • "నీచిత్తం వచ్చినట్టు నీవు తిరుగుతుంటే ఇంటిసంగ తెవరు చూస్తారు?" వా.

చిత్తము వచ్చు

  • ఇష్టపడు.
  • "చిత్తంబు వ,చ్చినచో మానుదు గాని ని న్నిపుడు కస్తిం బెట్ట నా కేటికిన్." కాళ. 3. 72.

చిత్తము విడుచు

  • మన సొప్పకుండు.
  • "చేరి యచ్చట నిల్వఁ జిత్తంబు విడిచి." పల. పు. 8.

చిత్తయి పోవు

  • బాగా దెబ్బ తిను, నిర్వీర్యుడగు.
  • "అయిపోయా డయ్యా! ఈ దెబ్బతో చిత్తయి పోయాడు." కొత్త. 180.

చిత్తరించు

  • చిత్రించు.
  • "పండితమల్లుచక్షులను, చిత్తరించిన మాడ్కి." పండితా. ప్రథ. దీక్షా. పు. 175.

చిత్తరువులోని ప్రతిమవలె

  • కదలక మెదలక, నిశ్చలంగా. వాడుకలో - 'వాడు అప్పుడు రాసిన బొమ్మలాగా నిల్చుండి పోయాడు.'
  • "అచట నున్నవార లెల్లఁ జిత్తరువున వ్రాసినట్టి.....తడవుగను." కళా. 5. 6.

చిత్తరు వొత్తు

  • ముద్రిత మగు.
  • "చిత్తంబులో నీదు చెలు వైనమూర్తి, చిత్తరు వొత్తినచెలువంబు దోఁప." ద్విప. కల్యా. పు. 66.

చిత్తవాన

  • చిత్తజల్లు.
  • చిత్తకార్తిలో వాన ఉద్ధ్రుతంగా గబగబా వస్తుంది.
  • "చిత్తవాన గురియ." విప్ర. 4. 19.
  • "చిత్తవానలా వచ్చి పడ్డాయి రాళ్ళు." వా.
  • చూ. చిత్తజల్లుగా.

చిత్తాన బెట్టు

  • మనసులో పెట్టుకొను.
  • "చిత్తానఁ బెట్టకు మీమాట శ్రీరమణ మరవకు." తాళ్ల. సం. 7. 103.

చిత్తారిపని

  • బచ్చెన పని; కర్రతో