పుట:PadabhamdhaParijathamu.djvu/746

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్త - చిత్త 720 చిత్త - చిత్త

  • 2. ఏకాగ్రతతో.
  • "చిత్తగించి వినుము." భాగ. 5. స్కం. 7. 16.
  • 3. దయచేసి.
  • "చెప్పవే వ్యాసనందన చిత్తగించి." భాగ. స్కం. 9.
  • 4. విను.
  • "విన్నవించినార మిన్ని యాకర్ణించి, కొంచె మనక చిత్తగించవలయు." కృష్ణ. 2. 139.
  • 5. ఆలోచించు.
  • "స్త్రీలకు బుద్ధులు ప్రళయముల్ చిత్తగింప." కుచేల. 1. 115.

చిత్తజల్లుగ

  • అధికముగా; అత్యుద్ధ్రుతంతో.
  • చిత్తకార్తిలోని వానవలె.
  • చిత్తకార్తివాన గబగబా వచ్చి ఆగుతుంది.
  • "పాండుతనూజుఁడు చిత్తజల్లుగాఁ, గురియుపయోధరంబుక్రియ." జైమి. 7. 39.
  • "ఇనుప గునపంబులో యనఁ దనరి కురిసె, నెంతయును జిత్తజల్లుగ నేదు ముండ్లు." కళా. 5. 8.

చిత్తపరితాపము సేయు

  • మన:ఖేదము కల్గించు.
  • "నీవు దపంబు సేయఁ బోఁ దలఁపకు మమ్మ, చిత్తపరితాపము సేయకు మమ్మ." కుమా. 6. 7.

చిత్తము కరగు

  • హృదయము ద్రవీభూత మగు
  • "ఆ వైకుంఠము....సభామండప, శ్రీవిస్ఫూర్తికతంబున న్మిగుల నాచిత్తంబు నానందము, ద్రావైచిత్రి గరంచు చున్నయది...." కళా. 2. 12.
  • "భామ తనమీఁద నెన రైన బాగుఁ జూచి, చిత్తము గరంగి శుభభద్రశేఖరుండు." హంస. 2. 65.

చిత్తము కైపు

  • మానసోద్రేకము, ఆవేశము.
  • "పడం బొడిచి చంపక చిత్తము కైఁపు వోవునే." కుమా. 11. 49.

చిత్తము చీకటి గొల్పు

  • కలత పఱుచు.
  • "చీఁకటి గొల్పె బ్రాహ్మణుని చిత్తము పెన్నెఱి సోగవెండ్రుకల్." శివ. 3. 44.

చిత్తము తప్ప జేసికొను

  • అయిష్టమునకు పాల్పడు.
  • "హరియుధిష్ఠిరుల చిత్తము తప్పఁ జేసి కొంటి." జైమి. 7. 34.

చిత్తము తెలియు

  • అభిప్రాయ మెఱుగు.
  • "దేవర చిత్తంబు దెలియమి నట్లు సే,యఁగ నేమి దోఁచునో యనుచు వెఱతు...." కళా. 1. 192.

చిత్తమునకు వచ్చు

  • ఇష్టపడు; మనసుపడు; నచ్చు.
  • "నీ చిత్తమునకు వచ్చినవానిం గారుణ్యంబునఁ గైకొని." భార. కర్ణ. 1. 285.
  • "వనిత ! నీ చిత్తమున కేను వత్తు నేని." శివ. 3. 68.