ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చప్ప - చబు 688 చమ - చమ్మె
చప్పని
- నిస్సార మైన. సుమతి. 108.
చప్పరమంచము
- పందిరిమంచము. శ. ర.
చప్పరించు
- 1. నోటితో చప్పరించు - తిను, ఆస్వాదించు.
- 2. ఆ అదేమిటి లే అని నిర్లక్ష్యత కనబఱచు.
- "జపతపంబులు తలఁచినఁ జప్పరించు." మహిమ. 3. 3.
- "వాని కెంత గొప్పవిశేషం చెప్పినా చప్పరించి వేస్తాడు." వా.
చప్పలించు
- చప్పరించు.
చప్పి చప్పి
- చప్పరించి చప్పరించి.
- "దప్పి నంగేక్షువుల్ చప్పి చప్పి." కా. మా. 4. 137.
చప్పిడి.
- ఉప్పు లేని, కారం లేని.
- "చప్పిడిపథ్యంతో ఈ మందు తినాలి." వా.
చప్పిడిముక్కు
- అణగిపోయిన ముక్కు.
చబుకు సేయు
- కొరడాతో కొట్టు.
- "సైంధవంబుల ధే యని చబుకు సేయ." జైమి. 6. 53.
చమడా లూడగొట్టు
- చర్మం ఒలిచి వేయు. తిట్టుగానే అలవాటు.
- "ఇంకోసారి ఆమాట అన్నా వంటే చమడా లూడగొడతాను." వా.
- చూ. చమడా లెక్కగొట్టు.
చెమడా లెక్కగొట్టు
- చూ. చమడా లూడగొట్టు.
చమురుకాళ్ల పెద్దమ్మ
- దురదృష్టవంతుడు, చేత కాని వాడు, సోమరి.
- "ఆ చమురుకాళ్ల పెద్దమ్మను పట్టుకొని ఏం చేస్తాము?" వా.
చమురు చల్లిన మంటలకై వడి
- విజృంభించి. మంటలలో నూనె పోస్తే మరింత మండుతుంది.
- "చమురు చల్లిన మంటల కైవడిఁ, బ్రత్తి తాల్చినవడువున." ఉ. హరి. 3. 71.
చమురు దీసిన దివ్వె
- ఆరిపోవునది, చంచలము. చము రుంటేనే దీపం వెలుగుతుంది కదా.
- "చమురు దీసినదివ్వె సంసారము." తాళ్ల. సం. 11. 3. భా. 71.
చమ్మెట వ్రేయు
- సమ్మెటతో కొట్టు.
- "ఈ, వీరులు నిన్నుఁ జమ్మెటనె వ్రేయుదు డాయుదుఁ బోర శౌరికిన్." ఉ. హరి. 4. 206.