పుట:PadabhamdhaParijathamu.djvu/701

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చక్క - చక్క 675 చక్క - చక్క

చక్కట్లు దిద్దు

  • సరి దిద్దు.
  • "జక్కవకవన్ జక్కట్లు దిద్దున్ గుచా హంకారంబు." విజయ. 2. 16.
  • రూ. చక్కటులు దిద్దు.

చక్కడచు

  • సంహరించు.
  • "చక్కడఁతు నిన్ను విష్ణునిఁ, బెక్కులు ప్రేలెదవు." భాగ. స్క. 7. 272.

చక్క నగు

  • సరిపడు, నెఱవేఱు - ఇత్యాది భావచ్ఛాయలలో కనిపించు మాట.
  • "కలికి భుజంగసంగతిఁ గన్న కేతకి, సాధ్విచెంత వసింపఁ జక్క నౌనె." ఇందు. 3. 72.

చక్కనయ్య

  • మన్మథుడు.

చక్కని కొమ్మ

  • అంద మైన స్త్రీ.
  • "మనవమ్మానన్నో చ,క్కని కొమ్మా మెచ్చుకొమ్మ కథ విని పొమ్మా!" హంస. 1. 149.

చక్కనిమిన్ను

  • గగనమధ్యం.
  • "సవితృండు చక్కని మింటికిం జనుదెంచె." భార. భీష్మ. 3. 346.

చక్కనివారిలో మిగుల చక్కనిది (వాడు)

  • అతి సౌందర్యవంతురాలు (డు) ఇట్టి పలుకుబడులు మనకు చాలా ఉన్నవి. ధనవంతులలో ధనవంతుడు - ఇత్యాది.
  • "చక్కనివారిలో మిగులఁ జక్కని దాన వటంచు వేడ్కతోఁ, జొక్కముఁ జెప్పి రందులకుఁ జూచినయందుకు..." హంస. 1. 84.

చక్కబడు

  • సరిపడు; నెఱవేరు.
  • "ఈ పని ఇంతలో చక్కబడేట్టు లేదు." వా.

చక్కబఱచు

  • సవరించు.
  • "శయ్య విదిలించి పైచీర చక్కఁ బఱచి." రుక్మాం. 4. 82.

చక్కబెట్టు

  • 1. చాలించు, కట్టిపెట్టు.
  • "జపహోమతంత్రముల్ చక్కఁ బెట్టి." రుక్మాం. 4. 102.
  • 2. సరిచేయు, చక్కదిద్దు.
  • "...........మీ రొక్కొక వేళ..... చక్కఁబెట్టువాడు." పాండు. 5. 218.
  • 3. దొంగిలించు.
  • "వాడు అందరూ నిద్ర పోతూండడం చూచి ఆరవేసిన నాలుగు పంచలూ చీరలూ చక్క బెట్టుకొని పోయాడు." వా.
  • 4. లోబరచుకొను.
  • "వాళ్లయింటికి అప్పుడప్పుడూ పోతూ వస్తూనే ఉండి, వాడు ఆ పిల్లను కాస్తా చక్క బెట్టినాడు."