పుట:PadabhamdhaParijathamu.djvu/702

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చక్క - చక్కా 676 చక్కి - చక్కి

 • 5. బియ్యం సరిచేయు.
 • "బియ్యం చక్కబెట్టి ఆ తరవాత ఎసట్లో పోయవే." వా.
 • ఇదే వాడుకలో పశ్చిమ ప్రాంతాలలో 'సగబెట్టు' అనే రూపంలో విరివిగా వినవస్తుంది.
 • "ఆ పొరక, చేట అంతా సగబెట్టి కసువు నూకు." వా.
 • చూ. సగబెట్టు.

చక్కబోవు

 • సరాసరిగా వెడలిపోవు.
 • "ఈసారి చని వేఁడ నే మనునో యని, సంకోచమునఁ గొక్కి చక్కఁబోవు." హంస. 3. 155.
 • "వాడు నేను పిలుస్తూండగానే చక్కా పోయాడు." వా.

చక్క సగము

 • సరిగ్గా సగం.
 • "ఒడలిలోఁ జక్క సగము నా కొసఁగు మనుడు." ఉత్త. హరి. 5. 56.
 • చూ. చక్క సమము.

చక్క సమము

 • సరిగ్గా సగం.
 • "పంచి పెట్టెదం, జక్క సమంబుగాఁగ నిది సమ్మత మౌఁ గద మీకు వారికిన్." దశా. 2. 343.
 • చూ. చక్క సగము.

చక్కాడు

 • 1. సంహరించు.
 • "తక్కిన రాక్షసదళముల నొకటఁ, జక్కాడె మానవశరమహత్త్వమున." రంగ. రా. బాల. పు. 35. పంక్తి. 23.
 • 2. నుఱుమాడు, తెగగొట్టు.
 • "ఖడ్గ మెత్తినఁ జక్కాడెఁ గంబు కంఠి." కాశీ. 6. 245.

చక్కిలిగింత

 • సంతోషకారి; చక్కిలిగిలి.
 • "అమరుల బోనపుట్టిక సహస్రమయూఖుని జోడుకోడె సం,తమసము వేరు విత్తు కుముదంబుల చక్కిలిగింత పుంశ్చలీ, సమితికిఁ జుక్కవాలు." పారి. 2. 41.
 • "చక్కిలిగింత పెడితే నాకు బా గుండదు." వా.

చక్కిలిగిలిగింత

 • చక్కిలిగింత.
 • "చొక్క మగు రాధహృదయము, చక్కిలి గిలిగింత గొనియె శంబర రిపుచేన్." రాధా. 4. 71.

చక్కిలి గిలిగిలి

 • గిలిగింతలు పెట్టుటలో అను మాట. చక్కిలిగిలిగిలీ అంటూ నవ్వునట్లు అరి కాళ్లలోనూ చంకలలోనూ వ్రేళ్లతో తాకుతారు. నవ్వు వస్తుంది.
 • "క్రిక్కించుఁ జక్కిలి గిలిగిలియనుచు." పండితా. ప్రథ. పురా. పుట. 457.

చక్కిలింతలు పుచ్చు

 • గిలిగింతలు పెట్టు. పండితా. ప్రథ. పురా. పుట. 457.
 • రూ. చక్కిలి గిలిగిలి పెట్టు.