పుట:PadabhamdhaParijathamu.djvu/700

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంపు - చక్క 674 చక్క - చక్క

చంపుడు గట్ట

 • వధ్యశిల.
 • "చంపుడుగట్ట యగు శిలాపట్టంబు మెట్టి." కాశీ. 5. 169.

చంపుడు గట్టు

 • చూ. చంపుడు గట్ట.

చంపుడు ముంపుడు

 • చచ్చు పుచ్చు; చెఱుచునట్టి. ఇదేదో విశేషణంగానే ఉపయోగిస్తారు.
 • "చంపుడు ముంపుడు బోధ గాథలన్." పాండు. 5. 224.
 • చూ. చచ్చు పుచ్చు.

చకచకా

 • గబగబా.
 • "అతను ఏ పనైనా చకచకా చేసుకొని పోతాడు." వా.

చకారపు గుడులు

 • చీవాట్లు, చీకొట్టుటలు.
 • వాడి దగ్గరికి వెళ్లా మంటే చకారపు గుడులకు తక్కు వుండవు." వా.

చక్క జూచు

 • 1. బాగుగా చూచుకొను, ఆదరించు.
 • "సాగఁబడి మ్రొక్కి యిల్లాలిఁ జక్కఁ జూడఁ గావు మని బాస లీయఁగాఁ గంటి నేను." శుక. 1. 526.
 • 2. సరిగా చూచు, బాగా చూచు.
 • "కడుకొనక తప్పఁ జూచినఁ, జెడులోకము లనుట యిది ప్రసిద్ధము జగతిన్, మృడ నీవు చక్కఁ జూచిన, జెడియె మనోభవుఁడు నిది విచిత్రము గాదే." కుమా. 9. 44.
 • శ్లేష ఇక్కడ.

చక్క జేయు

 • 1. సరిపఱచు.
 • "విరస మయ్యె నేని వెర వెద్ది మఱి చక్క,జేయ నీవ చింత చేసి చూడు." ప్రభా. 5. 19.
 • 2. సంస్కరించు.
 • "స్నానంబు గావించి చనుదెంచు నంతలో, జపవేదిఁ దగురీతిఁ జక్కఁ జేయు." ఉత్త. రా. 1. 199.
 • 3. పూర్తి చేయు.
 • "పోయివచ్చి నీ,పని మఱి చక్కఁ జేసెద నెపంబు సహింపుము." భాస్క. రా. సుం. 83.
 • 4. చంపు, కూల్చు.
 • "గంగానందనుఁ గూల్చి ద్రోణుపని చక్కంజేసి కౌరవ్యవీ,రాంగమ్ముల్ నుఱుమాడి." భార. భీష్మ. 2. 153.
 • "జలరాశి గర్వంబుఁ జక్కఁజేసి." భాగ. 6. 306.

చక్క జేర్చు

 • సవరించు.
 • "తమ్మి పూ,మొగ్గల నేలు పూపచను ముక్కులఁ బయ్యెదఁ జక్కఁ జేర్చుచున్." శుక. 1. 293.

చక్కటులు దిద్దు

 • చక్క దిద్దు.
 • "......జక్కవకవం జక్కట్లు దిద్దున్ గుచా,హంకారంబు మదాళిమాలికల నూటాడించు వేణీరుచుల్. విజ. 2. 16.
 • రూ. చక్కట్లు దిద్దు.