ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గ్రుడ్లు - ఘంటా 666 ఘంటా - ఘట
- "గవిలో బెబ్బులి డాఁగి గ్రుడ్లు మెఱమంగాఁ గాంచి రా జేసె నే,య వడిన్ బాణమువెంటనే." మను. 4. 46.
గ్రుడ్లు వెలి కుఱుక నొక్కు
- బాగుగా నొక్కు.
- "మెడ యొడిసి పట్టి గ్రుడ్డు వెలి కుఱక నొక్కుచు..." కళా. 3. 278.
- "గుడ్లు బయటికి వచ్చేటట్టుగా మెడ నొక్కినాడు." వా.
గ్రుడ్లు వెల్కుఱకు
- గ్రుడ్లు బయటికి వచ్చు.
- గొంతు బిగుసుకొన్నప్పుడూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని చెప్పుటకున్నూ వాడుకలో గుడ్లు బయటికి వచ్చినవి అంటారు.
- "గుంతలోఁ బడ గ్రుడ్లు వెల్కుఱక నాల్క, నడుము గఱుచక నఱచుచు బెడసి మడిసె." హంస. 1. 193.
గ్రుద్దులాడు
- కొట్లాడు.
- పశ్చిమాంధ్రంలో అతిప్రచురంగా వాడుకలో ఉన్నది.
గ్రొచ్చి కోరాడు
- త్రవ్వు.
- "ప్రాభవంబున దోర్దండబలము మెఱసి, గ్రొచ్చి కోరాడి త్రవ్విరి కుతల మెల్ల." భాగ. 9. 205.
ఘంటాపథము
- 1. రాజమార్గము.
- "కలువడంబులు గట్టి ఘంటాపథములందుఁ, బొడవుగా నునుఁబట్టుపడగ లెత్తి." రుక్మాం. 1. 118.
- 2. రాచబాట వంటిది. కొట్టినపిండి అనుట.
- "వేదశాస్త్ర పురాణాది విద్య లెల్లఁ, దరుణి నీయాన ఘంటాపథంబు మాకు." నైష. 2. 49.
ఘంటాపథముగా
- నిశ్చయముగా.
- ముక్తకంఠంతో అనుట. రాచబాటలో నడచినట్లు నిరాఘాటముగా అనుటపై మాఱిమాఱి వచ్చిన పలుకుబడి.
- "నిదురమబ్బున నున్న నెన్నెఱిని నెఱను, బొరడుఁబోక ఘంటాపథమ్ముగ నిగమములు." వ్యాఖ్యా. చాటు. తె. జా.
ఘటదాసుని చేయు
- నౌకరుగా చేయు.
- "....నే మనంబునం, దలఁచిన రుద్రు నైన ఘటదాసునిఁ జేయుదుఁ గామునింటికిన్." మార్కం. 1. 21.
ఘటన
- దైవఘటన.
- చూ. దైవఘటన.
ఘటన చేయు
- సంఘటిల్ల జేయు.
- "కలిమి యంగంబు లెల్లను ఘటన చేసి." పార్వ. 6. 93.
ఘటనపడు
- సంఘటిల్లు.