పుట:PadabhamdhaParijathamu.djvu/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడి______అడి 43 అడి_______అడు

అడియడు

  • పాద సేవకుడు.

అడియరి

  • సేవకుడు, నీచుడు.
  • "అడియరితనమున న ప్పాండవుల నాశ్రయింపజాల." భార. సౌ. 1. 7.
  • "అడియరి యై తా భోగార్థముగా దాచిన." విజ్ఞా. అచా. 87.
  • "అటమటీని తోడ నడియరితోడను వెలకు నెత్తమాడ వెరవు గాదు."
  • ఉ. హరి. 3. 112.

అడియాలము

  • సంకేతము, ఆనవాలు.
  • దక్షిణాంధ్రంలో ఇది వాడుకలో నేటికీ ఉన్నది. *రూపాం) అడయాళము. ఇది కన్నడంమాట.
  • "అందరకు సంజ్ఞలు నడియాలంబులుం గల్పించి."
  • భార. భీష్మ. 1. 122.
  • "వాడు దొంగిలించినా డనడానికి అడియాళం ఏమీ దొరకలే దట." వా.

అడియాస

  • పేరాశ.
  • "అక్కట! మోసపోయి యడియాసల జావక యున్న దాన."
  • భార. విరా. 2. 226.
  • "సామ్యముల గోరక పొ మ్మడియాస లేటికిన్." భార. అర. 4. అ.
  • "వాడి వన్నీ ఒట్టి అడియాసలు." వా.

అడివి మేళం

  • అమాయకురాలు. ఏమీ తెలియనిది అనుట.
  • "ఆవిడ ఒట్టి అడివి మేళం. దాన్ని కట్టుకొని ఏం చేస్తావు?" వా.

అడిసాటా

  • కమిషను వ్యాపారము. అడితిగొని చేయు వ్యాపారము. అరసట్టా, సట్టా వ్యాపారం అని నేటివాడుక.

అడిసిగ్గులు

  • నునుసిగ్గులు. తలవంచుకొన జేయుసిగ్గులు. ఇందులోని అడికూడా కాలే, కాళ్లు చూచుకొనుట. తల వంచుకొనుట ఒకటే కదా.
  • "అడిసిగ్గులు తమకంబులు నుడివోవగ." యయాతిచరిత్ర.

అడకులు దిన్న ట్లగునే కడుపున గుట్టెత్తినపుడు

  • చేసినప్పటికంటె దానిఫలితం అనుభవానికి వచ్చినప్పుడు తెలుస్తుంది అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "అడుకులు దిన్న ట్లగునే కడుపున గుట్టెత్తినపుడు గడు బఱచితి."
  • భార. ద్రోణ. 4. 89.

అడుక్కు తిను

  • ఒకతిట్టు, కోపంతో ఎక్కడో దేబిరించు అనుట.
  • "చదువుకోక పోతే అడుక్కు తింటాడు."
  • "ఇంతసే పెక్కడ అడుక్క తింటున్నావురా." వా.

అడుక్కొను

  • ప్రాధేయపడు.
  • "జనని యడుక్కొని చదువుకో