పుట:PadabhamdhaParijathamu.djvu/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అడి_______అడి 42 అడి_______అడి

 • ప్రశ్నించేవా రుండరు. ఏమి? అని అనేవా రుండరు.
 • "ని, న్నడిగెడువా డుండడు ప్రొ, ద్దుడిగిన బయనింపు మించు కోపిక గలుగున్." క్షేత్ర. పు. 37.
 • చూ. అడిగేవాళ్లు పెట్టేవాళ్లు లేరు.

అడిగొట్టు

 • కుచ్చితుడు.

అడిచిపడు

 • మిడిసిపడు.
 • చూ. అడిచిపాటు.
 • "నీకు వృద్ధసేవ లేకున్కి యెఱుగంగనయ్యె రిత్త యిట్టు లడిచిపడుటం, బట్టి."
 • భార. కర్ణ. 3. 71.

అడిచినుకు పొడిచినుకు

 • కొద్దిగా పడువాన.

అడిచిపాటు

 • మిడిసిపాటు.
 • త్వర, తొందర అని నిఘంటువులలోని అర్థము సరి కాదు.
 • "సమర ము పేక్షించి శాంతిమై నుండెద నడిచిపా టేటికి."
 • భార. భీష్మ. 3. ఆ.
 • "జడనిధిచందంబున ని,మ్మడు వొప్పంగ నిప్పు డేమి మాడెను నిమ్మై, నడచిపడ రిత్త నెవ్వగ, లుడుగుడు మఱి చూచు కొంద మొయ్యన తఱిలోన్."
 • భార. శాంతి. 3. ఆ.
 • "అడిచిపడు నాజ్యహోమ మంత్రాహుతులకు."
 • శృం. నైష. 4. ఆ.

అడిత్రావు (గు) డనక

 • తక్కువతిండి అని చూడక.
 • "అడిత్రాగు డనక యిప్పటి, కడిదికి నేమాంస మైన గ్రక్కున గొనిరం డెడసేయక..."
 • నారా/ పంచ. 1. ఆ.

అడితిదారు

 • అడితి పుచ్చుకొని సరు కమ్ము వాడు.
 • చూ. అడిసాటా.

అడిదపు మెకము

 • ఖడ్గమృగము.

అడిబంటు

 • సేవకుడు, కాపలావాడు.
 • "ఆమని యింద్రియముల కడిబంటను."
 • తాళ్ళ. సం. 7. 246.

అడిబండ

 • అధముడు.
 • ఒక తిట్టు.

అడిబీరపుతులువ

 • డంబాచారపు మనిషి, వట్టి బీరములు పలుకువాడు.
 • "అడిబీరపు తులువ గెలుచు నటె పాండవులన్."
 • భార. ద్రో. 4. 184.

అడిబీరము

 • శుష్కప్రతాపము.
 • భార. ద్రో. 4. 184.

అడియండ

 • నమస్కారము, దాసోహమనుట. అడి - కాలు (అడి+అండ) అడియేన్ వంటిది.
 • "దండంబు దర్పితోద్దండరక్షోహర్త కడియండ జాతరూపాంబరునకు."
 • రుక్మాం. 1. 123.