పుట:PadabhamdhaParijathamu.djvu/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అడు_______అడు 44 అడు_______అడు

బొమ్మన్న వినక వేమఱు వెక్కి వెక్కి యేడ్చు." హంస. 3. ఆ. 142.

 • "నామాట వినరా అని యెంత అడుక్కున్నా వాడు విన లేదు." వా.
 • "పెద్దవాణ్ణి అడుక్కుం టున్నాను. ఇక అక్కడికి వెళ్ళకు." వా.

అడుక్కొని తిను

 • చూ. అడుక్కు తిను.

అడుగంటు

 • 1. ఇంకిపోవు, తఱుగు, నశించు.
 • 2. అన్నము మొదలగునవి మాడిపోవు.
 • "లేకి నిధవ్రజంబు, లవలేశము కాంచన భూధరంబు ర,త్నాకరరత్న రాసు లడుగంట్లు......పురవైశ్యుల సంపద లెన్ని చూపుచోన్." కవికర్ణ. 1. 11.
 • "అన్నం అడుగంటింది."
 • "వాళ్ళింట్లో ఉన్న బంగారం, వెండి అంతా అడుగంటి పోయింది." వా.

అడుగకుండిన పోదు

 • అడిగితీరవలసిందే అనుట.
 • "అడుగకుండిన బోదింక ననుచు బలికె." కళా. 7. 6.
 • "నిన్నీవిషయం అడగాలని చాలనాళ్ళ నుంచీ అనుకొంటున్నాను. ఇన్నాళ్లూ కుదర లేదు. ఇక అడగకుండా ఉండడానికి వీలు లేదు." వా.

అడు గటు పెట్టను

 • కాలు కదల్చను.
 • ఖండితముగా రా నని చెప్పుటలో ఉపయోగించుపలుకుబడి.
 • "ధరణి విడిచి దివికి నడు గటు వెట్టన్." కళా. 3. 244.

అడు గటు పెట్టలేను

 • ముందుకు నడవను.
 • "తల నిండగ నర్థము వోసి తేని నే నడుగటు వెట్టగా వెఱతు నచ్యుత." ప్రభా. 1. 92.
 • రూ. అడుగు తీసి అడుగు పెట్ట లేను."

అడుగడు గశ్వమేధము

 • అడుగడుగూ ఒక గండం. అశ్వమేధం అతి కష్టసాధ్యమైనయాగం లక్షణయా అంత కష్ట మైనపని అనుట.
 • "అడుగడు గశ్వమేధ మగు నాజి మొనన్." కుమా. 11. 44.

అడుగడుగునకు

 • తేప తేపకు, అడుగు పెట్టినప్పు డెల్ల.
 • "అర్ద్రవస్త్రంబు లంగంబు లంటవడకి, కొనుచు నమ్రత నడుగడుగునకు బెద్ద, మాట గోవింద యనుచును."
 • హంస. 4. ఆ. 212.
 • "వాడు అడుగడుక్కూ ఆక్షేపిస్తాడు." వా.

అడుగ బంపు

 • విచారించు, కుశల మడుగు.
 • "నాటనుండియుం బదిలము గాగ నన్నడుగ బంపనికారణ మేమి?" పారి. 2. 28.

అడుగబోవు

 • యాచించు.
 • "బలిదైత్యు నడుగ బోయిన నాటి హైన్య మొకటి." జైమి. 1. 44.