ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గోపి - గోరం 657 గోరం - గోర
టపై వచ్చినది. మాదాకవళ మన్నట్లే సందగోపాల మనుటా అలవాటు.
- "గోపాల మనుచు, వీధి నెవ్వారు నుడివిన వెక్కిరించు." విప్ర. 3. 15.
గోపిచందనం
- ఒకజాతి సుద్దమన్ను. పచ్చగా ఉంటుంది. వైష్ణవులు బొట్టుగా ఉపయోగిస్తారు.
గోప్రవేశము
- సాయం వేళ, గోధూళివేళ.
గోముఖవ్యాఘ్రము
- పైకి మంచిగా ఉంటూ లోపల చెడుగుణము కలవాడు.
- "తనకు నేల యమృతధామాఖ్య గోముఖ, వ్యాఘ్ర మనఁగ నిట్టివాఁడె సుమ్ము." కళా. 6. 268.
గోరం గడుతేరుపనికి గొడ్డలి యేల?
- చిన్నదానికి పెద్ద ప్రయత్న మెందుకు?
- "నేరుపు లేటికిఁ జూపను, గోరం గడతేరుపనికి గొడ్డలి యేలా?" రుక్మాం. 2. 127.
- చూ. గోటితో పోవుపనికి గొడ్డలి...
గోరంత
- కాసంత.
- "వాడికి గోరం తైనా కనికరం లేదు." వా.
గోరంత ప్రొద్దు
- 1. కాసేపు.
- "వారును దాను నవారితశక్తి, గోరంత ప్రొద్దు మేకొని కట్టు బిగిచి." బసవ. 3. 65.
- 2. కొద్దిగా ప్రొద్దున్న దనుట.
- "గోరంత పొద్దైనా లేదు. మనం పోవలసినదూరం చాలా ఉంది." వా.
గోరంతలాట
- ఒక బాలక్రీడ. పండితా. ప్రథ. పురా. పుట. 460.
గోరం జీరు
- గోటితో గీరి సైగ చేయు.
- "కంటికిం బ్రియం బైనవానిం గామించియు గోరం జీరియుఁ గొంత యాస తీర్చుకొని." శుక. 2. 10.
గోరంతలు కొండంతలు చేయు
- చిన్న దానిని పెద్దగా చేయు.
- "ఎంతకుఁ దెచ్చెనే సరసిజేక్షణ చెయ్దము లిందుమీఁద జ,న్మాంతరవర్తనంబు హృదయంబున కిత్తఱి నెచ్చరించి గో,రంతలు కొండ లంత లగునట్లుగఁ జేసితి మంచుఁ జేటికా,వాంత సతాళవృంత మృదువాతహిమాంబుకణాళిఁ జేర్చినన్." ఆము. 5. 77.
- "వాని కెప్పుడూ గోరంతలు కొండంతలు చేసి చెప్పడం అలవాటు. వాడేదో మాటవరసకు పలకరిస్తే త నేదో మిత్రు డంటున్నా డేమిటి?" వా.
గోర దివియగా నే ఱై పాఱు
- కొంచెము కల్పించుకొను