ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గేలి - గొంతు 644 గొంతు - గొంతు
గేలి సేయు
- గేలి చేయు.
గొంజెగొడుగు
- ఆతపత్రము.
- "గొంజెగొడుగులే కొం డెల్లా." తాళ్ల. సం. 11. 3 భా. 53.
గొండ్లికొను
- నాట్య మాడు. సుద. 3. 34.
గొంతు ఆరిపోవు
- అఱపువల్ల గొంతు తడి ఆరు.
- "అరగంట మాట్లాడేసరికి నా గొంతు ఆరిపోయింది." వా.
గొంతుక తడుపుకొను
- దప్పి తీర్చుకొను, కడుపు నించుకొను. గువ్వలచెన్న. 3.
గొంతుకు ఉరి యగు
- బాధాకరముగా పరిణమించు.
- "వీడు నాకు గొంతుకు ఉరి అయి కూర్చున్నాడు." వా.
గొంతు కూచుండు
- పట్టు పట్టు.
- "వాడు ఈపని చేస్తేకాని అన్నం తిన నంటూ గొంతు కూచున్నాడు." వా.
గొంతు కూర్చొను
- మోకాళ్లపై గొంతు మోయునట్లుగా కూర్చుండు.
- "భోజనందగ్గర గొంతు కూర్చుంటూ వేమిట్రా!" వా.
గొంతు కొను
- గొంతు కూర్చుండు.
గొంతు కోయు
- ద్రోహము చేయు. నా. మా. 28.
గొంతు కోసినా....
- ఏమి చేసినా అనుట.
- "వాడు గొంతు కోసినా నిజం చెప్పేనా?" వా.
గొంతు చించుకొను
- అఱచు.
- నిరసనగా మాట్లాడేటప్పుడు ఉపయోగించే పలుకుబడి.
- "ఎందుకు అంత గొంతు చించుకుంటావు రా? పిల్లవాళ్లు అల్లరిఒ చేయక పోతే మనం చేస్తామా?" వా.
గొంతు చిదుము పని
- మెడ నులిమి చంపుట.
- "కుఱుచవగ చిక్కటారిం, బరికింపక గొంతు చిదుముపనిఁ దలఁచి..." శుక. 1. 318.
- చూ. గొంతు పిసుకు, మెడనులుము, తల దఱుగు ఇత్యాదులు.
గొంతు చేసికొను
- అఱచు.
- "ఇంతీ! యెవ్వరు లే రని, గొంతేటికిఁ జేసె దెవరు గొనిపోయెదరే?' హంస. 3. 222.
గొంతున బడు
- గొంతులో తగుల్కొను, (మింగునపుడు) మింగుడు పడక పోవు.
- "వెన్నెలముద్ద భుజింపఁ బోయి గొం,తునఁ బడవేసికొన్న హిమతోయ మొసంగిరి." నిరంకు. 2. 104.