పుట:PadabhamdhaParijathamu.djvu/668

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గృహ - గెంటు 642 గెంటు - గెడ

గృహకృత్యములు దీర్చు

  • ఇంటిపనులు నెఱవేర్చు.
  • "తనదు గృహకృత్యములు దీర్చుకొనుచు నుండె." హంస. 5. 365.

గృహచ్ఛిద్రాలు

  • ఇంటి యిబ్బందులు.
  • "ఈమధ్య చాలా గృహచ్ఛిద్రాలు వచ్చాయి. వాటితో నా మనస్సు ఏమీ బావుండ లేదు." వా.

గెంటస మాడు

  • హాస్య మాడు. న్యూనతపఱచుచు మాట లాడు.
  • "బ్రహ్మవారువముల, గెంటసం బాడు నడ గల్గుకిసలయోష్ఠి." పాండు. 3. 193.

గెంటు గుంటును లేక

  • గంటు గణుపు లేక.
  • అనగా నవురుగా సవురుగా. స్తంభాలకూ వానికీ ఉపయోగించే కఱ్ఱలో గంటూ గణుపులూ లేకుండా ఉన్నప్పుడే అది స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది.
  • "భవనఘటనకు మొదలికంబమును బోలె....నెట్టుకొనియె గెంటు గుంటును లేక." పాండు. 2. 55.

గెంటు గొంటును లేక

  • నవురుగా సవురుగా.
  • "నిట్ట నిలుచున్కిచేఁ గాదె నెట్టు కొనియె, గెంటు గొంటును లేక లక్ష్మీ కళత్ర !" పాండు. 2. 55.
  • ఇదో పాఠాంతరం.

గెంటుపడు

  • తప్పిపోవు; వైతొలగు.
  • చూ. గెంటువడు.

గెంటువడు

  • తప్పించుకొను. గెంటినప్పుడు మనిషి ఆవలి వైపుకు పోవును కనుక గెంటువడుట అనగా తప్పించుకొనుటగా మారినది.
  • "గదాహతి నొకఁడున్, గెంటు వడకుండఁ బీనుఁగుఁ, బెంటలు గావించె." జైమి. 3. 105.

గెడకత్తియ

  • ఆటది; తోటిది.
  • దొమ్మరివాడు గెడకట్టి ఆడడం ప్రసిద్ధం. గెడసాని కూడా ఇలా వచ్చిందే.
  • "తమతోడ నాడు గెడకత్తియ కాఁ గయిసేసి రామనిన్." కుమా. 9. 108.
  • రూ. గెడకత్తె.

గెడగూడు

  • కలగూడు.
  • "గెడగూడ దీని నతని యొడలిపయిం బెట్టి కాల్చు టుచితంబు." భార. విరా. 3. 12.
  • 2. కలియు - రత్యర్థ మై.
  • "ఉష్ణ శీతాన్న కబళము లొకఁడు సూపఁ బవలొ రాత్రియొ గెడగూడ నవసర మని, దాని కుత్తర మొకలతా తన్వి యిచ్చె, నధరబింబము విఱిచి సంధ్యాగమ మని." నైష. 9. 187.