ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గుమ్మ - గుమ్మ 634 గుమ్మ - గుమ్మె
వారియెడ ఉపయోగించే పలుకుబడి.
ఒక పిట్టకథ దీనికి మూలం. ఒక చోట గుమ్మిడికాయల దొంగతనం జరిగిం దట. అందరినీ చేర్చి రాజుగారు దొంగతనాలు చేస్తే చేశారు. బుజాలమీదే పెట్టుకోవలా అన్నా డట. అనగానే అసలు దొంగతనం చేసినవాడు బుజాలు తడిమి చూచు కున్నా డట.
- "ఏదో మాటవరసకి నే నంటే నువ్వులికి పడతా వేం? గుమ్మిడికాయల దొంగలాగా." వా.
- "గుమ్మిడికాయలదొంగ అంటే బుజాలు తడివి చూచుకున్నాడట." సా.
- చూ. బుజాలు తడిమి చూచుకొను.
గుమ్మడికాయ లన్న బుజాలు పట్టి చూచుకొను తాళ్ల. సం. 3. 519.
- చూ. గుమ్మడి.
గుమ్మడికాయలో ఆవగింజంత
- ఏ కొద్దికూడా కాలేదను పట్ల ఉపయోగించే పలుకుబడి.
- అత్యల్పము.
- "కొలఁది మీఱఁ బెద్ద గుమ్మడికాయలో, నావగింజ యంత యైనఁ గలదె?" సావం. 2. 26.
- "చేయవలసిన పని చాలా ఉంది. గుమ్మడికాయలో ఆవగింజం తైనా కాలేదు." వా.
గుమ్మడిగింజ నామము
- గుమ్మడిగింజ ఆకారంతో పెట్టే బొట్టు.
గుమ్మడిమూట గట్టు
- గుమ్మడికాయవలె ముడుచుకొని పోవునట్లు చేయు.
- "ఇరుచంబడ గుమ్మడిమూట గట్టి వీ,పెక్కి దువాళి చేసి చలి యిక్కడ నక్కడఁ బెట్టు వేకువన్." క్రీడా. పు. 15.
గుమ్మడివిత్తు నామము
- గుమ్మడిగింజ ఆకారంలో ఉన్న బొట్టు. ప్రభా. 4. 137.
గుమ్మ పడు
- కుప్పగూలు.
గుమ్ము గుమ్మను
- 1. చెవులు దిమ్మ వేసుకొనుట లోని ధ్వన్యనుకరణము.
- "గుమ్ముగుమ్మని చెవుల్ దిమ్ముపడఁగ." రాధి. 2. 20.
- 2. చిలుకటలో ధ్వన్యనుకరణము.
- "కవ్వపుఁగొండ వార్ధిలోఁ, దేలుచు గుమ్ముగు మ్మనఁగ ద్రిప్పఁగఁ జొచ్చిరి." హర. 6. 74.
గుమ్మెతకాడు
- గుమ్మెత అనే వాద్యం - ఘట