ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గుత్తు - గుది 630 గుది - గుది
- "కొన్ని దేశంబు లిరులచే గుత్తి వడియె." కాశీ. 1. 137.
గుత్తగు త్తను
- ప్రాణం బితబిత మను భయ భ్రాంతి కలుగు.
- "ప్రాణములు గుత్తుగు త్తనంగ." హరి. పూ. 9. 132.
గుదగుదలు
- అనుమానాలు.
గుదగుద మను
- దిగులు కలుగు; మనసు ఎలాగో అగు.
- "గుడి కేఁగ రామిని గుదగుద మనుచుఁ, గుడవక..." బస. 6. 180. పు.
గుదగుద లాడు
- డగ్గుత్తికతో నేడ్చు. బ్రౌన్.
గుదికర్ర
- జంజాటము.
- పశువులమెడలకు గుదికర్ర కడతారు, అందుపై ఏర్పడినది.
- "వృద్ధునకుఁ దన కీ గుదికర్ర యెందులకో." సుకన్య. 10.
గుదికాలు
- మడమ.
గుదికుచ్చు
- పేర్చు, కూర్చు.
గుదిగుంజలు
- పసులదొడ్డి వాకిట పాతిన గుంజలు. బ్రౌన్.
గుదిగుంపులు చేయు
- కలత పెట్టు
- "దివిజవేశ్యల, సదనంబుల నున్న మౌని సంతతి తలఁపుల్, గుదిగుంపులు చేసి మథిం,పదె." నిరంకు. 2. 32.
గుదిగొను
- ఎక్కువగు, చిక్క నగు ఇత్యాది భావచ్ఛాయలలో వినిపించే మాట.
గుది గ్రుచ్చి
- వరుస పెట్టి.
- "ముదిలంజవిధమున ము న్నిట్టికథలు, గుది గ్రుచ్చుకొని చెప్పికొని పోవ వలదు." ప్రభులిం. 7. 60.
గుదిగ్రుచ్చు
- 1. ఒకచోట చేర్చు.
- "గురుతర ద్రుమములు గుదిగ్రుచ్చు నట్లుగ." కళా. 6. 68.
- 2. ఒక గుదెకు - సూదికి గ్రుచ్చు.
- "గుదిగ్రుచ్చెఁ గొందరఁ గూల్చెఁ గొందరిని." పల. పు. 113.
- "ఆ పూల నన్నిటినీ గుదిగుచ్చి మాల కట్టు." వా.
గుదిత్రాడు
- దూడకాలికి కట్టే త్రాడు. బ్రౌన్.
గుదిత్రోయు
- గుదికట్టి త్రోయు.
గుదియకఱ్ఱలు
- గుదికఱ్ఱలు.