Jump to content

పుట:PadabhamdhaParijathamu.djvu/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడ_______అడ 39 అడ_______అడ

అడపకాడు

  • తాంబూలకరండవాహకుడు. అడపది ఆడ దైతే అడపకాడు మగవాడు.
  • చూ. అడపది.

అడపట్టె పట్టు

  • విత్తిన తరువాత విత్తనాల మీద మన్ను పడేవిధంగా ఒక రక మైన గుంటకను తోలుతారు. అలా తోలడమే అడపట్టె పట్టడం.

అడపతిత్తులు

  • వక్కలు ఆకులు పొవ్వాకు సున్నం వగైరా లుంచుకునే బట్టతో కుట్టినసంచులు. నేటికీ ఇవి వాడుకలో నున్నవి. అడపం అనీ అంటారు అలాంటి తిత్తిని.
  • పండితా. ద్వితీ. పర్వ. పుట. 317.
  • చూ. అడపది.

అడపది

  • తాంబూలక రండ వాహిని. తాంబూలం పళ్ళెం పట్టుకొని ఎప్పుడూ రాజున కిచ్చునది.
  • "ఆకు మడుపు లీ దివిరెడు నడప దాని." ఉ.రా. 4. 223.

అడపాదడపా

  • అప్పుడప్పుడూ. జం.
  • "వాడు అడపా దడపా మాయింటికి వస్తుంటాడు."
  • "అడపాదడపా వాడికి జ్వరం వస్తుంటుంది." వా.

అడపొడ

  • జాడ. జం.
  • "వాడి అడాపొడా తెలియడం లేదు. పదిరోజు లయింది ఇల్లు విడిచిపోయి." వా.

అడపొడ లేకపోవు

  • రూపరి పోవు, స్వరూపనాశన మగు.
  • "ధూర్జటి కంటి కడిందిమంటలో నడపొడ కానరాక తెగటారియు." మను. 3. ఆ.
  • "వారి యీసుచే నడపొడ లేకపోయెనట యల్పము లయ్యె గులాభి మానముల్." కళా. 7. 44.

అడబాల

  • మహానసాధ్యక్షుడు - అతనితో పా టున్న ఉద్యోగి.
  • వంటవాడు వంటలక్క అని శ. ర. కన్నడంలో వంటలక్క, వంటవాడు అని కాక మాంసము అన్న అర్థం కూడా ఉంది. ఇక్కడ మామూలు వంటవాడు కాక ఋ మహానసాధ్యక్షుని వంటి పెద్ద ఉద్యోగో కావచ్చు ననిపిస్తుంది.
  • "బండారులను నడబాళ్ల బ్రెగ్గడల దండ నాయకులను దంత్రపాలకుల."
  • బస. 7 ఆ. 23 పు.
  • "అడబాల గొనిపోయి యమ్మీనుజించి, కడుపులో నొకబాలు గని వెఱ గంది."
  • భాగ. దశ. స్కం.

అడలడి

  • 1. అలజడి, ఆందోళన.