పుట:PadabhamdhaParijathamu.djvu/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అడ_______అడ 38 అడ________అడ

అడకత్తెరలో పడు

 • ఇఱుకున చిక్కుకొను.
 • "వాడు అడకత్తెరలో పడి మిటకరిస్తున్నాడు." వా.

అడకత్తెరలో పోకలాగ

 • చిక్కులో ఇరుకుకొని పోవుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "చెల్లెలు, భార్యా మధ్య వాడు అడకత్తెరలో పోకలాగా అయిపోయాడు." వా.

అడకొత్తున నొత్తు

 • ఇఱుకున పెట్టి బాధించు, అడకొత్తునం దొత్తినట్లు అనుట.
 • "ఓర్వదు బంధుజాల మడకొత్తున నొత్తును మామగారు."
 • శశాం.3. అ.

అడగనివానిది పాపం

 • అడిగినవాని కల్లా ఇచ్చు ననుట.
 • అడగనివాడు పా పాత్ముడు అని కూడా అంటారు.
 • "అందరూ అన్నీ ఒడుచుకొని పోయారు. అడగనివానిది పాపం!" వా.

అడగిపోవు

 • అణగిపోవు.
 • "పుడిసెడు నీటిచే నడగిపోయెడు ధూళికి."
 • జైమి. 5. 7.

అడగోలుకొను

 • వశము చేసికొను.
 • "శంకరార్థ దేహం బడగోలుకొన్న."
 • హరి. ఉ. 6. 19.
 • "ఆ యంబుజనేత్ర నన్ను నడగోల్కొనియెన్." దశ. 5. 55.
 • "ఇల్ల డసొమ్ము నడగోలుగొని త్రోచు నతనిగతికి."
 • భోజ. 6. 14.
 • అడమానములోని 'అడ' కూడా యిదే. దీనికి 'అపహరించు' అని అర్థం చెప్ప నక్కఱ లేదు. వశము చేసికొను అను అర్థమే అన్ని చోట్లా సరిపోతుంది.

అడచిపడు

 • మిడిసిపడు.
 • చూ. అడిచిపడు.

అడజడి పెట్టు

 • అలజడి కలిగించు.
 • "అడజడి పెట్టు మాటలటు లాడగ గూడునె యీయకార్యముల్, విడువు లతాంగి."
 • మార్క. ఆ. 1.

అడపకత్తె

 • తాంబాలక రండవాహిక. రాయలసీమలో ఇప్పటికీ వక్క, ఆకు, పొగాకు, సున్నం మొదలయినవి, ఒక గుడ్డతో సంచి కుట్టి అందులో ముఖ్యంగా ఆడవాళ్లు - వేసుకుంటారు. దానిని అడప మనే అంటారు. అడపతిత్తి అన్నా అదే. అడపం పట్టుకొనునది అడపకత్తె.
 • "అడపకత్తెలు తెలనాకు మడుపు లొసగ." వైజ. 1. 113.
 • చూ. అడపది.