ఈ పుట ఆమోదించబడ్డది
అటు______అట్ట 36 అట్ట_______అట్టి
- "ఓరి దండధర! యీ చండితనంబు లటుండనీ రా." హేమా. పు. 29.
అటువంటివారమా
- అటువంటివారము కాము, మంచివారము అనుట.
- "అటువంటివారమా యాకలి దప్పమిక్కిలి పుణ్య మన్న నంగీకరించి."
- శుక. 4. ఆ. 7. ప.
- "నేను అట్లాంటివాణ్ణి కాదు."
- "నేను అట్లాంటిదాన్ని కాదు. నాతో సరస మాడ వద్దు." వా.
- ఏక వచనంలో - మహదమహదర్థలాలు రెండింటా యిది ప్రయుక్త మవుతుంది.
అటో యిటో తేల్చి చెప్పు
- నిశ్చి తాభిప్రాయమును వెల్లడించు.
- రుద్రమ. 9. పు.
అట్టకట్టు
- చిక్కగా యేర్పడు.
- "....క్రొమ్మావి చిగురు బఱపుపెట్టు పెట్టినచందాన నట్టకట్టె."
- శకుంతలా. 3. 177.
- "చెమటకాతలతో ఒళ్ళంతా అట్ట కట్టుకొని పోయింది." వా.
అట్టళ్లు వన్ను
- కోటకొమ్మలపై కాపలా సైనికుల నుంచుటకై గదుల నేర్పరచు.
- "కోట సింగారించి కొత్తళంబుల నెల్ల నట్టళ్లు వన్నించి యాళువరికి." ఉ. హరి. 2. 92.
అట్టహాసం
- దర్జా, దర్పం.
- ఇందులో కొంత 'ఇంత ప్రదర్శన మెందు' కన్నవ్యంగ్యం అంతర్భూత మై ఉంది.
- సంస్కృతంలో మామూలుగా ఉన్న గట్టిగా నవ్వడం అన్న అర్థం ఇందులో మాసి పోయింది.
- "వా డిప్పుడు మన కెక్కడ దర్శనం యిస్తాడు. వాడి అట్టహాసమూ వాడూ వెలిగిపోతున్నాడు."
- "వాడీమధ్య మహా అట్టహాసంగా ఉన్నాడు." వా.
అట్టహాసంగా
- మహా దర్జాగా.
- చూ. అట్టహాసం.
అట్టహాసం పట్టపగలు
- వాడి దర్జా చాలా పెరిగి పోతూ ఉంది అని కొంత నిరసన సూచిస్తూ అనేమాట.
- "వాళ్ళ అమ్మమ్మవైపు ముదనష్టపుఆస్తి యేదో వచ్చిపడింది. ఇంకేం! వాడిదంతా అట్టహాసం పట్టపగలుగా ఉంది." వా.
అట్టిట్టగు
- 1. డోలాందోళిత మగు
- "అయ్యనిమిషలోచనకు హృదయ మట్టి ట్టయ్యెన్." నిరంకు. 4. 41.
- 2. సంచలించు.