ఈ పుట ఆమోదించబడ్డది
అజ్జ______అట 35 అట______అటు
అజ్జ యైనవేళ
- వీలుపడినప్పుడు, అవకాశము చిక్కినప్పుడు.
- "అని పలికె నదియు మొదలుగ వెనుదీయక యజ్జ యైన వేళల నెల్లన్."
- శుక. 3. ఆ. 494 ప.
అజాగళ స్తనాలు
- వ్యర్థము లనుట.
- "నగంగ నైన వా, క్రుచ్చి యజాగళ స్తన సగోత్రులు వారల నెన్న నేటికిన్."
- కళాపూ. 1. 7.
అజా పజా లేదు.
- చూ. అజా వజా లేదు.
అజా వజా లేదు.
- అయిపు లేదు.
- "వాడి అజావజా లేదు. మూడు రోజులయింది వాడు ఇల్లు విడిచిపోయి.:: వా.
అజ్ఞాతవాసం
- రహస్యముగా జీవించుట, ప్రజల యెరుకకు రాకుండా ఉండుట.
- పాండవులు పండ్రెండేండ్లు అరణ్యవాసం చేసి, ఆతరవాత ఒకయేడు అజ్ఞాత వాసం చేశారు. దానిపై వచ్చిన పలుకుబడి.
- " నే నిప్పుడు అజ్ఞాతవాసంలో ఉంటున్నాను. ఒక్కసారే ఒక కావ్యం ముగించి ప్రజలముందు పడతాను." వా.
అటకలు-నాకు
- దరిద్రముతో బాధపడు.
- అటకలు అనగా వంట చేసుకునే చిన్నకుండలు.
- "అత్త అటకలు నాకుతూ ఉంటే అల్లుడు వచ్చి దీపావళిపండగ అన్నాడట." పా.
అటమటకాడు
- మోసగాడు.
- "అటమటకాడు మహామాయలాడు." గౌర. హరి. 2. 646.
అటమటము
- అయథార్థము.
- "అటమటమో లేక నిజమొ." సారం. 2. 254.
అటమున్ను
- అంతకంటె ముందు.
- "సృష్టికి నటమున్ను." హర. 3. 13.
- కాశీ. 4. 213.
అటుకుగింజ
- గడుసరి.
అటుకులు తిని చేయి కడుగు కొన్నట్లు
- పూర్తిగా సంబంధము వదలు కొన్నట్లు.
- అటుకులు తింటే చేయి కడుక్కోకనే చేతి కేమీ మిగలదు. ఇక కడుక్కుంటే అసలేమీ ఉండదు కదా!
- "మీ చెల్లెలు పోగానే ఆయింటి సంబంధం అటుకులు తిని చేయి కడుక్కున్న ట్లయింది." వా.
అటుండనీ
- అది అలా ఉండనీ.