Jump to content

పుట:PadabhamdhaParijathamu.djvu/599

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీగ - క్రుచ్చి 573 క్రుమ్మి - క్రుళ్లి

క్రీగడుపు

  • పొత్తికడుపు.
  • క్రిందిది అనుట.

క్రీగాడ్పు

  • అపానవాయువు.

క్రీగోరు

  • కాలిగోరు.

క్రీదొడ

  • తొడ క్రిందిభాగము.

క్రీనీరు నేల

  • ఊటతో చెమ్మగిల్లిన నేల.

క్రీయూట

  • చూ. క్రియ్యూట.

క్రుంకువెట్టు

  • మునుగు, నిమగ్ను డగు.
  • "విపులాంభోనిధిఁ గ్రుంకువెట్టి." నిరంకు. 3. 49.

క్రుంగబడు

  • క్రుంగిపోవు.
  • "ధర గ్రుంగఁబడఁగ." భాస్క. రా. కిష్కి. 431.

క్రుంగిల బడు

  • క్రుంగిపోవు.
  • "పాన్పుమీఁదటఁ గ్రుంగిలఁబడఁగఁ దిగిచి, ప్రథమసురతంబు గావించు ప్రౌఢ వౌర." రాజగో. 56.

క్రుచ్చి యెత్తు

  • కౌగిలించు.
  • "పే, రక్కునఁ గ్రుచ్చి యెత్తుకొని." కవిక. 3. 167.

క్రుమ్మి కూరాకు సేయు

  • చిందర వందర చేయు.
  • "పులులు జట్టలు చీరి దుప్పులను లేళ్ల, నేకలమ్ములఁ గ్రుమ్మి కూరాకు సేసి, యమరఁ జమరులఁ బట్టి పాలార్తు మిపుడు, సామి! చూడుము నీ బంట్ల సత్తు వనుచు." సారం 1. 90.

క్రుమ్ములాడు

  • పోట్లాడు; దెబ్బలాడు.
  • పశువులు కొమ్ములతో క్రుమ్ములాడుటపై వచ్చినది.
  • "వీనిఁ బడవైచె నాతఁడా వీరుఁ డనుచుఁ, గా దనుచుఁ గ్రుమ్ములాడు నక్తంచరాళి." కువల. 2. 151.

క్రుమ్మెసలాడు

  • పోట్లాడు. రంగా. 3. 218.

క్రుయ్యక డయ్యక

  • చులాగ్గా.
  • "అయ్యంగరాజుతోడం, గయ్యము సేయుచును దుర్ముఖప్రాణంబుల్, సయ్యనఁ దొమ్మిది యమ్ములఁ, గ్రుయ్యక డయ్యక యతండు గొనియె నరేంద్రా!" భార. ద్రో. 4. 198.

క్రుయ్యబాఱు

  • కృశించు.

క్రుళ్లి గుల్లగు

  • కుళ్లి కృశించు.
  • "....కవులు చెడనాడ వగన్, గ్రుళ్లి తనలోనె గు ల్లై, పెల్లుగ శంఖంబు మొర్రపెట్టుచు నుండున్." రాధా. 1. 154.