పుట:PadabhamdhaParijathamu.djvu/564

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొన - కొన 540 కొన - కొని

కొన మునిగించు

 • పూర్తిగా ముంచు.
 • "కినిసి పల్కితి వారిఁ బిశా చులార పొం,డని యిటు లన్న మాత్రనె మహా శనిపాతమువోలె వారలం, గొన మునిగించె నాపలుకు కుత్సితరూపులు గాఁగఁ జేయుచున్." ఉద్ధ. 1. 188.

కొనల కెక్కు

 • పై కెక్కు; ఉన్నతి నందు. వర. రా. అయో. పు. 269. పం. 4.

కొనలు నిగుడు

 • పెరుగు, వర్ధిల్లు.
 • "కుశల మడిగి ప్రియము కొనలు నిగుడ." భార. అర. 5. 29.
 • చూ. కొనలు సాగు.

కొనలు వాఱు

 • వర్ధిల్లు. ప్రభా. 2. 105.

కొనలు సాగు

 • వృద్ధి చెందు.
 • ఇది తీగలు మొదలగునవి పెరుగుటలో కొనలు సాగుటను బట్టి వచ్చిన పలుకుబడి. ఇలాంటివే కొనలు నిగుడు, తీగ సాగు ఇత్యాదులు.
 • "అనవుడుఁ గనుంగొనల గొనలు సాగు, కనలున..." కా. మా. 1. 57.
 • "శబరకాంతాఘనస్తనశాతకుంభ, కుంభ యుగములఁ గరికరి కొనలు సాఁగె." కా. మా. 3. 12.
 • "లోన దండెమ్ముల లోమలు చుట్టుగాఁ, బెనఁగొని మీఁదికిఁ గొనలు సాఁగి." రాజగో. 1. 96.

కొనలొత్తు

 • వర్ధిలు.
 • "వేడ్కలు కొనలొత్తునపుడు." రంగ. రా. బాల. 25 పుట.

కొనసాగు

 • 1. వర్ధిల్లు.
 • "ఇంకఁ గొనసాఁగుఁ జుమీ కుశలంబు మాదెసన్." పాండు. 4. 53.
 • "రాజీవనయనకు రాగంబు కొనసాఁగె." రాధా. 1. 128.
 • 2. బాగా జరుగు.
 • "శర్వుల చిత్తవృత్తి కొనసాఁగుచు నుండుట." హర. 4. 45.
 • "ఈ విధంగానే ఎన్నాళ్లు కొనసాగుతుం దనుకుంటున్నావు?" వా.

కొనాకులు మేయు

 • పైపైన రుచి చూచు.
 • సమగ్రము, కూలంకషము కాని దనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "....నేను మాత్రము భావికార్యము నెడ కొనాకులు మేయఁబోను..." ధర్మజ. 65 పు. 8 పం. తె. జా.

కొనితెచ్చి పెట్టుకొన్న తద్దినం

 • అనవసరంగా కల్పించుకొన్న చిక్కు.
 • "వా ణ్ణేదో బుద్ధి చాలక ఇంట్లో ఉండమన్నాను. వా డింత పని చేశాడు. ఇదంతా కొని తెచ్చిపెట్టుకొన్న తద్దినంలాగా తయా రయింది." వా.