పుట:PadabhamdhaParijathamu.djvu/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అఘ________అఘో 30 అచ్చ_________అచ్చ

  • ఇటీవల ఏర్పడిన పలుకుబడి.
  • "ఈసభకు ఫలానావారిని అగ్రాసనాధి పతిగా ఉండవలసిం దని కోరుకున్నాను." వా.

అఘటనఘటనాపటిమ

  • చేయుటకు వీలు కానిపనులను కూడా చేయగలశక్తి.
  • "పతి మెచ్చ నఘటనఘటనాపటిమ నమ్మహామంత్రి రాజ్యభారమ్ము దీర్చు." హంస. 5. 261.
  • చూ. అఘటనఘటనాసమర్థుడు.

అఘోరించావు

  • ఏడిచావు.
  • నిరసనగా ఎదుటివాడిని అనుమాట.
  • కొత్త. 12.

అఘోరించు

  • 1. బాధపడు.
  • "వీడి కొంపలోపడి పదేండ్లుగా అఘోరిస్తున్నాను." వా.
  • 2. నిరసనగా అనునప్పుడు ఉపయోగించే పలుకుబడి.
  • "ఏదో ఒకటి అఘోరించు."
  • "అఘోరించావు ఊరుకో."
  • "అఘోరించాడు వెధవ." వా.

అఘోరింపు

  • ఏడ్పు. నిరసనగా అనుమాట.
  • "ఏమిట్రా! నీ అఘోరింపు. ఏమిటో చెప్పి యేడవరాదూ!' వా.

అఘోరేభ్యో చేస్తున్నాడు.

  • ఏడుస్తున్నాడు.
  • వైదిక పరిభాష.
  • "వా డేదో మూల కూర్చుని అఘోరేభ్యో చేస్తున్నాడే? ఏమిటి సంగతి?" వా.

అచ్చం

  • సరిగ్గా.
  • "అతడు అచ్చం వాళ్ళ తండ్రిపోలిక." వా.

అచ్చంగా

  • సరిగ్గా.
  • "అచ్చంగా యితను మా బావమరిది పోలికే." వా.

అచ్చగు

  • ముద్రిత మగు.
  • "ఈ పుస్తకం అయిదు సంవత్సరాల కింద అచ్చయింది."
  • "ఇది యింకా అచ్చు కాలేదు." వా.

అచ్చగుండ్ల పేరు

  • బంగారుగుండ్లతో చేసినదండ.

అచ్చటముచ్చట.

  • ముద్దు ముచ్చట. జం.
  • "కాపరానికి వచ్చి సంవత్సరం అయింది. కానీ ఒక అచ్చటా ముచ్చటా ఎరుగునా పాపం ! ఆ పిల్ల." వా.

అచ్చ తెలుగు

  • తత్సమేతర మైనఆంధ్రభాష.
  • "య యాతి చరిత్ర అచ్చ తెలుగు కావ్యము." వా.

అచ్చన గండ్లు

  • అచ్చనగాయ లను ఆటలో ఉపయోగించురాళ్లు.

అచ్చనగాయలు

  • ఆడపిల్లలు ఆటలో ఉపయోగించేరాళ్లు, చింతగింజలు.