పుట:PadabhamdhaParijathamu.djvu/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అగ్ని________అగ్ర 29 అగ్ర__________అగ్రా

 • అన్న వైదిక ప్రవచనంపై వచ్చిన పలుకుబడి

అగ్ని యిచ్చు

 • అగ్ని సంస్కార మొనర్చు.
 • "భూకాంతుల ననేక సహస్రసంఖ్యలం బ్రోవులు గా బెట్టించి సమగ్రదారు సముదయంబు లమర్చి యగ్ని యిచ్చిరి." భార. స్త్రీ. 2. 172.

అగ్ని శిఖ

 • కుంకుమపూవు.

అగ్ని హోత్ర మయి పోవు

 • మండిపడు.
 • "నే నామాట అనేసరికి వాడు అగ్ని హోత్రం అయిపోయాడు." వా.

అగ్రతాంబూలము

 • సభలో పెద్ద వారి కిచ్చు మొదటి తాంబూలము. పెండ్లిండ్లూ వాటిలో పెద్ద వారికే మొదటి తాంబూలం ఇస్తారు. అది గౌరవ సూచకం.
 • "...తుట్టతుదకు గట్టుకొన్న దానిని బిలుచుట యైన చేత కాని చచ్చు పెద్దమ్మలతో నగ్రతాంబూలమునకు సిద్ధ మయి నాడే!" సాక్షి. 189. పే.
 • "నీ కేం అగ్రతాంబూలం ఇస్తారా." వా.

అగ్రపుస్తకములు

 • వేదములు.
 • "అగ్ర పుస్తకంబు లర్చించి చూచుచు."

అగ్రహారపుచేయి

 • చాలా ఘటికుడు.
 • కన్యా. శు.

అగ్రహార భుక్తులు

 • అగ్ర హారీకులు.
 • పనీ పాటా లేక తిని కూర్చునే వారిపట్ల నిరసనగా ఉపయోగించేపలుకుబడి.

అగ్రహారము

 • బ్రాహ్మణు లుండేస్థలం. బ్రాహ్మణులుమాత్రమే ఉండే గ్రామం.

అగ్రహారములో తమ్మళి జోస్యము

 • కుదరనిది. చెల్ల నిది.
 • తాతకు దగ్గులు నేర్పుటవంటిది. అగ్రహారంలో ఉన్న వాళ్లలో చాలమంది గొప్ప జ్యోతిష్కులే ఉంటారు. తమ్మళివట్టి పూజారి అక్కడికి పోయి చెప్పేజోస్యం యే ముంటుంది?
 • "ఎమ్మెలు నాముందఱనా, యమ్మక్కరొ చెల్ల వగ్రహారములోనన్, దమ్మళి జోస్యము లన్నవిధ మ్మిది."
 • రుక్మాం. 5. 88.

అగ్రాసనం

 • ప్రధానస్థానము.
 • సభలలో వానిలో మొదటగా పెద్దలను కూర్చోబెట్టడం అలవాటు. అందుపై వచ్చిన పలుకుబడి.

అగ్రాసనాధిపతి

 • సభాధ్యక్షుడు - ప్రెసిడెంటు.