పుట:PadabhamdhaParijathamu.djvu/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అంటి_______అంటు 10 అంటు________అంటు

 • "ఇంత అంటిముట్టరాని అగ్రహార మైతే నలుగుర్లో తిరగడ మెందుకురా? నలుగురితో కలిశాక ఎవరో ఒకరు ఏదో ఒకటి అననే అంటారు." వా.

అంటి ముట్టేవారు

 • కులస్థులు.
 • "అంటిముట్టేవాళ్లు లేనిఊళ్లో ఉండడం కష్టం." వా.

అంటుకాడు

 • స్నేహితుడు, ప్రియుడు.
 • "అటువలె నంటుకాడు చనినంత." శశాం. 4. 28.

అంటుకుంటే వదలడు

 • వట్టి కబుర్లపోతును చూచి అనేమాట.
 • "అదుగో వా డొస్తున్నాడు. అంటుకుంటే వదలడు. త్వరగా వెళదాం పద." వా.

అంటుకుండ

 • వంట చేసి కడుగనికుండ.

అంటుకొనిపోవు

 • కఱచుకొనిపోవు, తగులుకొను.
 • "కాగితాలు అంటుకొని పోయినవి"
 • "వాడు దాన్ని అంటుకొని పోయినాడు." వా.

అంటునూనె

 • తలంటు నూనె.

అంటుపట్టు

 • అశౌచము వచ్చు.
 • తనవాళ్లు చనిపోయినప్పుడో, ప్రసవించినప్పుడో వచ్చే మైలను అశౌచం, అంటు అని అంటారు.- జాతాశౌచం, మృతాశౌచం - అని అది ద్వివిధం. తద్ద్వారా వచ్చిన పలుకుబడి.
 • "ఈనెలలో సత్యనారాయణవ్రతం చేసుకుందా మనుకుంటూంటే యింతలో మా బావగారు చనిపోయి మాకు అంటు వచ్చింది." వా.

అంటుపడు

 • ము ట్టగు.
 • చూ. అంటుపడు.

అంటుపోగులు

 • చెవులకు అంటుకొనునట్లుగా చేసిపోగులు.

అంటుమోవ తెగు

 • పూర్తిగా తెగు.
 • "కలనూ లెల్లను నంటుమోవ దెగిరాగా గొంతసే పుండి." ఆము. 4.3.

అంటుఱాయి

 • సూదంటురాయి, అయస్కాంతము.
 • "ఇను మంటుఱాతికి నెగసినభంగి." భాగ. 7 స్కం.

అంటువడు

 • ము ట్టగు.
 • "మా ఆవిడ అంటుపడ్డది. ఇంక నేనే చేయి కాల్చుకోవాలి." వా.

అంటు వాయకుండు

 • విడువక తిరుగు.
 • "గమనించుతఱి మందగమనశృంగారాప్తి, నంటు వాయక వెంట వెంట సెయిదు." సుక. 1. ఆ. 391 ప.
 • చూ. అంటి యుండు, వెన్నంటి యుండు