పుట:PadabhamdhaParijathamu.djvu/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అంటూ_______అంట్లు 11 అంట్లు________అండ

అంటూసొంటూ

 • సంబంధ మున్నవారు, మిగిలిన మెతుకులు ఇత్యాదులు. జం.
 • "వాడికి అంటూ సొంటూ లేదు. బోలెడు ఆస్తి."
 • "కుండలో అంటూ సొంటూ ఊడ్చి వాడికే పెట్టేశాను. మరీ పొయ్యి ముట్టిస్తే తప్ప గత్యంతరం లేదు." వా.

అంటేనుకొను - (అంట వేసుకొను)

 • ముట్టుకొను. పిల్లల ఆటల ద్వారా వచ్చినపలుకుబడి.
 • " నేను పరిగెత్తితే న న్నంటేసుకొనే వాడు ఈ భూప్రపంచకంలో లేడు." వా.

అంట్లబోకి

 • ఒక తిట్టు.
 • వంటయింటి ద్వారా వచ్చిన పలుకుబడి. బోకి - పాత్ర.
 • అంటయినపాత్రను మనవాళ్లు మైలగా చూస్తారు. మైల వెధవ అని అర్థం.
 • "వాడు ఒట్టి అంట్లబోకి." వా.

అంట్ల వెధవ

 • ఒక తిట్టు.
 • చూ. అంట్లబోకి.

అంట్లు తోమేవాడు.

 • ఆడంగులవాడు. ఒక తిట్టు.

అంట్లు నాకేవాడు

 • ఒక తిట్టు.
 • లక్షణయా ఎంగిలిమెతుకులు తినేవాడు అన్న అర్థంలో వచ్చినపలుకుబడి.
 • "వా డేమి పెద్దమనిషి. ఒట్టి అంట్లు నాకేవాడు." వా.

అంట్లు పొడుచు

 • తల కంటుకొని ఉన్న పేలను క్రుక్కు
 • "అంట్ల బొడిచి."
 • పాండు. 3. 30.

అంట్లొత్తు

 • అంట్లు త్రొక్కు.
 • "అం ట్లొత్తుపదనున నం ట్లొత్తు..."
 • కళా. 4.79.

అండగొట్టు

 • వెనుదీయు.
 • "అమ్మహాత్ముమీది చాయం జన వెఱచి యండగొట్టుచు నిలుచుటయు."
 • పరమ. 1. 175.

అండగొను

 • ఆశ్రయించు.
 • "నీ వండగొనియెదు నిలిచి యిచ్చోట."
 • మార్క. 1. 182.
 • "ఈతని...అండగొని తప్పుదు చావున కంచు నున్న వాడు."
 • భార. ఉద్యో. 4. 208.

అండదండ

 • సహాయము.
 • ఒండె వాదింపు మొండె నే నోడితి నను మొండె, యను సద్గురుండె మా కండదండ."
 • శంకరవిజయ కథా. 4. 10.