Jump to content

పుట:PadabhamdhaParijathamu.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంట_______అంటి 9 అంటి________అంటి

అంటముట్టరాని అగ్రహారము

  • మతీ సున్నిత మైనమనిషి - ఏమన్నా ఓర్చుకో లేనివాడు అనుపట్ల ఉపయోగిస్తారు.

అంటరానివాడు

  • అస్పృశ్యుడు.
  • లక్షణయా సంబంధ ముంచు కొనరానివా డని అర్థ మయినది.
  • "వాళ్లందరూ కలిసి న న్నంటరాని వాణ్ణిగా చూస్తున్నారు." వా.

అంటలుగట్టు

  • అతుకుకొనిపోవు, గుంపు చేరు.
  • "వాడు చాలనాళ్లు జబ్బుపడ్డాడు. వెంట్రుక లన్నీ అంటలు గట్టుకొని పోయినవి."
  • "జనం అంటలు గట్టుకొని ఆతిరు నాళ్లను చూస్తున్నారు."

అంటించు

  • ముట్టించు, కొండెములు చెప్పు.
  • "సాయంత్రం అయింది. దీపం అంటించు. పొయ్యి అంటించు."
  • "ఇక్కడ ఒకమాట అనీ అనక ముందే వాడు పక్కింటికి వెళ్లి అంటించి ఉంటాడు. అందుకే వాడంటే భయం నాకు." వా.

అంటి కుంచు ఆడుప్రాయము

  • చిన్న తనము.
  • ఆడుకొనువయసు అనుట.
  • "అంటి కుంచి యాడునట్టిప్రాయ మొకింత, నడచునంతలోన నాదుసతులం, బుణ్యశీలయుతల బోకార్చుకొన్నట్టి, నాకు బుత్రు లనుట నగవు గాదె!"
  • కళా. 6. 75.
  • చూ. అంటకుండి ఆడు ప్రాయము.

అంటితే మసి అవుతుంది

  • కల్పించుకొంటే ఏమి వస్తుందో అని దూరదూరంగా ఉండేవారివిషయంలో అనేమాట. వంటయింటిలో పుట్టినపలుకుబడి కావచ్చును.
  • "వాడు అంటితే మసి అవుతుంది అన్నట్లు ప్రవర్తిస్తుంటాడు." వా.

అంటి బాస చేయు

  • ఒట్టు పెట్టుకొను.
  • "అంటు పడ లేదటంచు మి మ్మంటి యిపుడు, బాస లెల్లను జేసెద భాసురాంగి." రాధి. 4. 10.

అంటి ముట్టక

  • తనకు సంబంధము లేనట్లు.
  • "వాడు ఈవిషయంలో అంటి ముట్టక తిరుగుతున్నాడు." వా.

అంటి ముట్టరాని అగ్రహారము

  • సున్నిత మైనది.
  • అగ్రహారాల్లో పూర్వం బ్రాహ్మలే ఉండేవారు. కాబట్టి అది చాలా ఆచారవంత మైనది అనుటపై యేర్పడిన పలుకుబడి. ఏమి అన్నా నొచ్చు కొనేవారి విషయంలో ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తారు.