ఈ పుట ఆమోదించబడ్డది
అంట_______అంట 8 అంట_______అంట
అంజెలు వేసుకుంటూ వెళ్లాడు." వా.
- చూ. అంగలు వేయు.
అంటకత్తెర వేయు
- వెంట్రుకలు కుఱుచుగా కత్తిరించు.
అంటక ముట్టక
- చూ. అంటి ముట్టక.
అంటకాగు
- జతగా దగ్గఱ ఉండు.
- కొత్త. 102.
అంటకుండి ఆడుప్రాయము
- చిఱుతప్రాయము.
- సంసారంలో కల్పించుకోకుండా ఆడుతూ పాడుతూ గడిపేప్రాయం అనుట.
- "అంటకుండి యాడునట్టి ప్ర్రయ మొకింత నడుచు నంతలోన..."
- కళా. 6. 76.
- చూ. అంటి కుంచి ఆడుప్రాయము.
అంటగట్టు
- 1. బలవంతముగా తగులగట్టు.
- "నే నెంత వద్దని మొత్తుకున్నా వినకుండా ఆపిల్లను నా కంట గట్టినాడు. నేను నానాబాధా పడుతున్నాను." వా.
- "నేను పోయేది లేదు. పెట్టేది లేదు. వద్దంటే వినకుండా అదేదో బెనిఫిట్ నాటక మని వాడు నా కొకటిక్కెట్టు అంటగట్టి పోయినాడు."" వా.
- 2. ఆరోపించు.
- ఎవడో చేసినతప్పు నా కంట గట్టాడు." వా.
అంటగట్టుకొని
- వెంటబెట్టుకొని, కలిసి యుండి.
- "రాకుమారుని నంటం గట్టుకొని శంఖ లిఖితుల కట్టెదురం దెచ్చి."
- జైమి. 4. 125.
- "వాడు ఎక్కడికి వెళ్లినా భార్యను అంటగట్టుకొని పోతుంటాడు." వా.
- "వాళ్లిద్దరూ ఎప్పుడూ అంటగట్టుకొని తిరుగుతూ ఉంటారు." వా.
- చూ. అంటగట్టు.
అంట గదుము
- తుదివరకూ తరుముకొనిపోవు.
- "ఎడబాయనీక బల్విడి నంట గదుముచు, నట్టిట్టు వడి ద్రోపులాడు నవియు." కళా. 8. 81.
అంటగ నేయు
- నాటునట్లు వేయు.
- "కుశు నురం బానక పర్వశరాహతిచే నంటగ నేసి." జైమి. 6. 185.
అం టగు
- ము ట్టగు.
- "కోడలు అంటయింది. మాటాడుతూ కూర్చుంటే ఎట్లా అమ్మా!" వా.
అంట దఱుము
- దొరికేవరకూ తరుము.
- "అగ్ని నాలుక లేడు నంట దఱిమి."
- కాశీ. 3. 31.
అంట పొడుచు
- బాగా నాటునట్లు పొడుచు.
అంట బలియు
- బాగా బలియు, రెండూ కలిసి పోవునట్లు అనుట.
- "అంట బలిసినతొడలు."
- గౌర. హరిశ్చం. పం. 1088.